కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..

భారత సైన్యం 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఉన్నత స్థాయి కమాండోలు దక్షిణ కశ్మీర్‌లోని కొకెర్‌నగ్‌ ప్రాంతంలోని గడోల్‌ అడవిలో అదృశ్యమయ్యారు. ఓ సంయుక్త ఆపరేషన్‌ సందర్భంగా ఈ నెల 6న వారు దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారు. వారి కోసం ఆర్మీ, పోలీసులు గాలిస్తున్నారు…గడోల్‌ అడవి లోతైన లోయలు, నిటారుగా ఉండే వాలు ప్రాంతాల్లో కూడిన ప్రాంతం. గతంలో ఈ అడవి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు నెలవు. ఈ నెల 6న భారీగా మంచు కురవడంతో అదృశ్యమైన వారి గాలింపు క్లిష్టమైంది. వారి అదృశ్యం వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలను సైన్యం కొట్టిపారేసింది…

దారి తప్పి ఉండవచ్చు..

అక్టోబర్ 6 సాయంత్రం కిష్త్వార్, అనంత్ నాగ్ మధ్య ఉన్న ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైనట్లు గుర్తించారు. వీరి మిస్సింగ్ తర్వాత వైమానిక నిఘా, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కఠినమైన ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ గోప్యంగా ఉన్నాయి. అయితే, ఈ అదృశ్యం వెనక ఉగ్రవాద ప్రమేయం లేదని తోసిపుచ్చుతున్నారు. ఈ ఇద్దరు జవాన్లు దారి తప్పి ఉండొచ్చని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.