*సూర్యాపేట*
సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరులో దండు మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
*కవిత మాట్లాడుతూ..
ప్రతి ఒక్కరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్న..
ఆత్మకూరు ఎస్ మండలంలో జర్నలిస్టులు, బాధ్యత కలిగిన పౌరులు సామాజిక జేఏసీ ఏర్పాటు చేసి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.
గ్రామాల్లో మద్యపాన నిషేధం, స్కూల్స్, కాలేజ్ లు బాగు చేయించటం, రోడ్లు బాగుచేయించటం లాంటి పనులు చేస్తున్నారు.
అదే విధంగా ఓటు హక్కు విలువ తెలుసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు.
ఎవరో ఒకరు ముందుకు వచ్చి పని చేస్తేనే మార్పు సాధ్యమవుతుంది.
రాజకీయ నాయకులు చెప్పినా, జీవో లు తెచ్చిన మార్పు సాధ్యం కాదు.
ప్రజల్లో మార్పు రావాలంటే అది క్షేత్రస్థాయి నుంచి రావాలి.
ఆ మార్పు కోసం సామాజిక జేఏసీ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా.
ముఖ్యంగా యువజన సంఘాలతో కలిసి ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా చేయాలని కోరుతున్నా.
చాలా చోట్ల యువత తప్పుదారి పడుతుందన్న అపవాదు ఉంది.
కానీ యువతకు సరైన అవకాశాలు, కావాల్సిన పెట్టుబడి లేకపోవటం కారణంగానే వారిలో ఆ నిరుత్తేజం ఉంది.
అలాంటి యువతను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని కోరుతున్నా.
జాగృతి కూడా సామాజిక జేఏసీతో కలిసి సమాజంలో మార్పు కోసం పనిచేస్తుంది..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959