పోలీసులు బలప్రయోగంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం… జాగృతి కవిత..

పోలీసులు బలప్రయోగంతో మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం… జాగృతి కవిత..

మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారు..

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది.. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం…

మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, తెలంగాణ జాగ‌ృతి కార్యకర్తలతో కలిసి ఆమె శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నది పరివాహక ప్రాంతాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న ఈ వెంచర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చివేయాలని చూస్తున్న రేవంత్ సర్కార్.. ఇలాంటి బడా వెంచర్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటుందని గట్టిగా ప్రశ్నించారు..