మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో, కుటుంబ సభ్యుల నడుమ సంక్రాంతి వేడుకలు జరిగాయి.
రంగు రంగుల ముగ్గుల రంగవల్లులు, సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే పలు రకాల అలంకరణలతో, ఎర్రవెల్లి నివాసంలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది.
గురువారం తన శ్రీమతి, పిల్లలతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన తల్లిదండ్రులు కల్వకుంట్ల శోభమ్మ, చంద్రశేఖర్ రావు శుభాశీస్సులు తీసుకున్నారు…
ఈ సందర్భంగా కేటీఆర్ శ్రీమతి శైలిమ, కుమారుడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు..
కుమారుడు, కోడలు, మనుమడు, మనుమరాలిని మనస్ఫూర్తిగా దీవించిన కేసీఆర్ దంపతులు, వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు….
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యుల నడుమ జరిగాయి. రంగు రంగుల ముగ్గుల రంగవల్లులు, సంక్రాంతి పండుగకు ప్రతీకగా నిలిచే పలు రకాల అలంకరణలతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి సంక్రాంతి శోభ వెల్లివిరిసింది..ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959