తిత్తి తీస్తాం…. ఇప్పటిదాకా కథ వేరు.. ఇక రేపట్నుంచి వేరు.. కాంగ్రెస్ సర్కార్కు కేసీఆర్ వార్నింగ్..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని గురించి పార్టీ నేతలతో చర్చించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గం, ఎల్పీ విస్తృతస్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన వారికి అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. అధికార పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందని చెప్పారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గర్వంతో ఎగిరిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నదని అన్నారు. గుడ్ల తీయడం, లాగులో తొండలు ఇడవడం వంటివి ఎలా చేయాలో చెబుతున్నదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా.. ఉన్నవాటిని కూడా ఆపేందని అన్నారు. తీసుకొచ్చిన పాలసీ అంతా కూడా రియల్ ఎస్టేట్కు సంబంధించినదే అని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి, చేను వద్దకు డైరెక్ట్గా వచ్చేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు యూరియా బస్తా కోసం రైతు కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు…
బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు ఇలాంటి అహంకారపూరిత హింస ప్రయత్నాలు చేయలేదని కేసీఆర్ తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో నేర్పుతున్నదని అన్నారు. గుడ్ల తీయడం, లాగులో తొండలు ఇడవడం వంటివి ఎలా చేయాలో చెబుతున్నదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా.. ఉన్నవాటిని కూడా ఆపేందని అన్నారు.
కథ ఏంటో చాలా మంది తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివక్షకు గురైన జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. 174 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉంది. 50 ఏళ్లు పాటించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. ఆ జిల్లాలో కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గతంలో పాలమూరును కోలుకోలేని దెబ్బకొట్టిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ.
బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు చాలా వాదించాం. పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని మేము వివరించాం. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరిస్తామని ట్రైబ్యునల్ తెలిపింది. బచావన్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు..
పాలమూరు కోసం గంటెడు నీరు అడిగినోళ్లు కూడా అప్పుడు లేరు. 1974లో బచావత్ ట్రైబ్యులన్ 17 టీఎంసీల నీటిని జూరాలకు సుమోటోగా కేటాయించింది” అని కేసీఆర్ అన్నారు…
తొందరపడి ఏ పని చేయట్లేదని.. అక్కసుతో మాట్లాడట్లేదని కేసీఆర్ తెలిపారు. అనేక రకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చప్పుడు లేదు.. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే దీనిపైనా చప్పుడు లేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నిలదీశారు. అందుకే ఈ పిరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలోకి దిగాలని అనుకున్నా అని స్పష్టం చేశారు. ఇవాళ మీటింగ్లో డిసైడ్ అయినమని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లా నాయకులతో సమావేశమై, కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సభలు పెడతాం.. కవులు, గాయకులను తట్టి లేపుతామని తెలిపారు.. అక్కడి ప్రజలకు జరిగే అన్యాయాన్ని జలదోపిడీని అరకట్టాలని మీడియాను కూడా విజ్ఞప్తి చేశారు.. ఇన్ని రోజులు ఒకరకంగా పోయాం.. ఇక తప్పేటట్లు లేదు.. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. భయపడమని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని.. మా కండ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు..