*అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.*
*సాయంత్రం 5 గంటల వరకు:*
– అసోంలో 84.42 శాతం
– కేరళలో 75 శాతం
– పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదు..
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. సాయంత్రం 5 గంటల వరకు అస్సాంలో 84.42 శాతం పోలింగ్ నమోదు. కేరళలో 75 శాతం పోలింగ్ నమోదు. పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదు…
అస్సాం, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిపోవడంతో అధికారయంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాల్లో బరిలోకి దిగిన 722 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కేరళంలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడు రాష్ట్రాలు అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్ ముగిసిపోగా..తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్ లో రెండువిడతలుగా ఏప్రిల్ 23న, 29న పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మే 4న వెల్లడిస్తారు…
విజయంపై ఎవరి ధీమా వారిదే..
అస్సాంలో అధికార బీజేపీకి చెందిన హిమంత్ బిశ్వశర్మ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేశాయి. కేరళంలో సీఎం పినరయి విజయన్ సారధ్యంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ కూడా విజయం మాదంటే మాదేనని చెప్పుకొచ్చాయి. అయితే పోలింగ్ ముగిసి..అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైన నేపథ్యంలో ఓటర్లు ఎవరిని గెలిపించారన్న సంగతి మే 4న తేలిపోనుంది…