కేరళం సీఎంగా వీడీ సతీశన్.
*• అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.*
కేసీ వేణుగోపాల్కు నిరాశ
వీడీ సతీశన్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా నెట్టూరు.
రాజాకీలయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన సతీశన్.
పరావూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీశన్.
2001లో మొదటిసారి పరావూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.. 2001, 2006, 2011, 2016, 2021, 2026లో ఎమ్మెల్యేగా ఎన్నిక..
ముఖ్యమంత్రి కానున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చార్జ్ దీపా దాస్ మున్షీ గురువారం (మే 14) ప్రకటించారు. విడి సతీసన్ను కేరళ కొత్త ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.
వీడీ సతీశన్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా నెట్టూరు.. రాజకీలయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.. పరవూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో మొదటిసారి పరావూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001, 2006, 2011, 2016, 2021, 2026లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) 102 స్థానాలు గెలుచుకుని నిర్ణయాత్మక మెజారిటీని కైవసం చేసుకుంది…