ఖైరతాబాద్ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.
దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన.
ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు గెజిట్.
గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి.
2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తింపు.
ఆర్టికల్ 191(2) పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత
ఈ నెల 18న హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు
ఇకపై మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్..
Khairatabad Bypoll:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 ఏప్రిల్ 23 నుంచి ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అందులో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా సెప్టెంబర్ 26వ తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పారా 2(1)(a), ఆర్టికల్ 191(2) కింద అనర్హత వేసినట్లు వెల్లడించారు. ఇటీవల దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు పడటంతో ఈ నోటిఫికేషన్ జారీ అయింది..
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తరువాతే ఎన్నిక!
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్) పూర్తయ్యాకే బై ఎలక్షన్ ఉంటుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సర్ ప్రక్రియ ప్రకారం నవంబరు 9న ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. దీంతో నవంబరు మూడో వారం నుంచి వచ్చే ఏడాది మార్చి తొలివారం లోపు ఎప్పుడైనా ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 90 వేల మంది ఓటర్లకు ఎన్నికల అధికారులు వివరాల్లో తేడాలున్న కారణంగా నోటీసులు ఇచ్చారు. నోటీసులకు సరైన సమాధానాలను ఇవ్వకపోతే భారీగా ఓట్లు గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.