షాకింగ్ విజువల్స్
భారీ వర్షాలకు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం జన్నారం వద్ద ఉన్న నిమ్మవాగులో డీసీఎం కొట్టుకపోవడంతో, గల్లంతైన డ్రైవర్.
https://x.com/r9telugunews/status/1983487748905558136
మోంథా తుఫాను ప్రభావంతో అటు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో అధికారులు, పోలీసులు పలు ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. అయితే ఖమ్మం జిల్లాలో ఒక డ్రైవర్ పోలీసుల మాటలను లెక్కచేయకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేసి డీసీఎంతో సహా వాగులో కొట్టుకుపోయాడు.