ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత..

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్..

వెలగుమట్ల వినోబా నగర్ భూదాన్ భూముల్లో పేదల ఇండ్ల కూల్చివేతలు

నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసుల మోహరింపు

రేవంతన్న, సీనన్న అని ఓటు వేసినందుకు తగిన శాస్తి అయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న బాధితులు

కవరేజ్ కోసం వెళ్తున్న మీడియా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటున్న పోలీస్ అధికారులు

అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్నామని అర్ధంతరంగా వెళ్లిపోమ్మంటే తమ బ్రతుకు ఏంటని బాధితుల ఆవేదన

పోలీసులను ప్రతిఘటించేందుకు కర్రలతో సిద్ధమైన నిర్వాసిత కాలనీ యువకులు..

ఖమ్మం కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చివేత…

60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయించేందుకు జేసీబీలతో మోహరించిన వేలాది మంది పోలీసులు..

10 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని జేసీబీలకు అడ్డుగా నిలబడుతున్న బాధితులు..

రేవంత్ రెడ్డికి ఓటు వేసిన పాపానికి తమను రోడ్డున పడేస్తున్నాడని బాధితుల ఆవేదన..