జపాన్‌ సంగతి చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక.!

జపాన్‌పై ఉత్తర కొరియా ఆగ్రహం.. అదనపు సైనిక చర్యలకు హెచ్చరిక..

జపాన్ సైనిక బలగాల విస్తరణతో పాటు అమెరికాకు చెందిన టామాహాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అదనపు సైనిక చర్యలు చేపట్టాల్సి వస్తుందని ఉత్తర కొరియా అధినేత Kim Yo-jong హెచ్చరించారు.

ఇటీవల జపాన్ విడుదల చేసిన రక్షణ శ్వేతపత్రం (డిఫెన్స్ వైట్ పేపర్)లో చైనా, రష్యా, ఉత్తర కొరియాలను ప్రధాన భద్రతా ముప్పులుగా పేర్కొనడాన్ని కిమ్ యో జోంగ్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఏజిస్ డిస్ట్రాయర్ చోకాయ్ నుంచి జపాన్ నిర్వహించిన అమెరికా తయారీ టామాహాక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను కూడా ఆమె ఖండించారు.
జపాన్ తన రక్షణ విధానాన్ని మార్చుకుని ముందస్తు దాడులకు, విదేశీ సైనిక చర్యలకు అనువుగా తన బలగాలను సిద్ధం చేసుకుంటోందని కిమ్ యో జోంగ్ ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రాంతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.