బయోపిక్స్ ట్రెండ్‌కు క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోందని తెలుస్తండగా అందులో రామ్ చరణ్ నటిస్తున్నట్లు మరోసారి వార్తలు హాల్చల్ చేస్తున్నాయి..బయోపిక్స్ ట్రెండ్‌కు క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. ఆ భాష, ఈ భాష అనేం లేదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లో సక్సెస్ అయిన వారి జీవితాల ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన పలు బయోపిక్స్ మంచి హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఈ తరహా సినిమాల కోసం ఆడియెన్స్‌లో వెయిటింగ్ పెరిగిపోయింది. అందుకే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖుల జీవితాలపై బయోపిక్స్ తీస్తున్నారు మేకర్స్. క్రికెటర్స్ లైఫ్ మీద కూడా ఇలాంటి తరహా చిత్రాలు వచ్చాయి. ధోని, సచిన్, కపిల్ దేవ్ బయోపిక్స్ వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. అందులో కోహ్లీ (Virat Kohli) క్యారెక్టర్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించనున్నట్లు సమాచారం..
PlayUnmute
Fullscreen
బయోపిక్స్ ట్రెండ్‌కు క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. ఆ భాష, ఈ భాష అనేం లేదు.. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఈ తరహా సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లో సక్సెస్ అయిన వారి జీవితాల ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన పలు బయోపిక్స్ మంచి హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఈ తరహా సినిమాల కోసం ఆడియెన్స్‌లో వెయిటింగ్ పెరిగిపోయింది. అందుకే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రముఖుల జీవితాలపై బయోపిక్స్ తీస్తున్నారు మేకర్స్. క్రికెటర్స్ లైఫ్ మీద కూడా ఇలాంటి తరహా చిత్రాలు వచ్చాయి. ధోని, సచిన్, కపిల్ దేవ్ బయోపిక్స్ వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బయోపిక్కు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. అందులో కోహ్లీ (Virat Kohli) క్యారెక్టర్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించనున్నట్లు సమాచారం..బయోపిక్‌లో కోహ్లీ పాత్రను రామ్ చరణ్ (Ram Charan) పోషించనున్నాడని.. అతిత్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని వినిపిస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని ప్లాన్ చేస్తోందని నెట్టింట జోరుగా ప్రచారం నడుస్తోంది. కోహ్లీగా కనిపించేందుకు చరణ్ ఓకే చెప్పాడని సమాచారం. అయితే గతంలో ఓసారి ఇలాంటి వార్తలు రాగా వాటిని చెర్రీ టీమ్ ఖండించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో అప్పట్లో దీనికి బ్రేక్ పడినా.. విరాట్ (Virat Kohli) బర్త్‌డే సందర్భంగా మరోమారు బయోపిక్ న్యూస్ ట్రెండింగ్‌గా మారింది..