హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో దారుణం..?
పైసా వసుళ్లుగా మారిన ఆసుపత్రులు..?
* అనారోగ్యంతో మెడికవర్ హాస్పిటల్కు వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి.
* వైద్యం కోసం ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా డబ్బులు కట్టిన కుటుంబ సభ్యులు.
* ఇంకో 4లక్షలు కడితేనే మృతదేహం ఇస్తామంటున్న ఆస్పత్రి సిబ్బంది.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చెప్పినా వినని వైనం.
* నిన్న అర్ధరాత్రి మూడు లక్షలు కట్టాలని, లేదంటే వైద్యం ఆపేస్తామని కుటుంబసభ్యులకు ఫోన్ చేసిన హాస్పిటల్ సిబ్బంది.
* ఉదయం లక్ష కట్టిన తరువాత పేషంట్ మృతి చెందిందని తెలిపిన హాస్పిటల్ సిబ్బంది.
* వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు…
అర్ధరాత్రి మరో రూ. మూడు లక్షలు కట్టాలని, లేదంటే వైద్యం ఆపేస్తామంటూ ఆస్పత్రి వర్గాలు నాగప్రియ కుటుంబీకులకు ఫోన్ చేశారు. ఉదయాన్నే లక్ష రూపాయలు కట్టిన తరువాత పేషంట్ మృతి చెందింది. మిగతా డబ్బు అంటూ మెడికవర్ హాస్పిటల్ వర్గాలు బేరం పెట్టాయి. వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మెడికవర్ ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.