మంత్రి కోమటిరెడ్డి పార్టీ ఆఫీసుపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల దాడి..!..అనంతరం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి

మంత్రి కోమటిరెడ్డి పార్టీ ఆఫీసుపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తల దాడి..!

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ నేతలు, నాయకులు దాడి చేశారు. నల్లగొండలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌పై కోడి గుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం మంత్రి దిష్టిబొమ్మను, క్యాంప్ ఆఫీసు దగ్గరున్న ఫ్లెక్సీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తగలబెట్టారు.నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు.. మంత్రి ఆఫీస్‌పై కోడి గుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడ్డారు. దాం తో రగిలిపోయిన కోమటిరెడ్డి వర్గం నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఆయన ఇంట్లోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు… అనంతరం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంట్లోని ఫ్రిజ్, కూలర్, టీవీ, సీసీ కెమెరాలతో పాటు ఇతర ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. వృద్ధాప్యంలో ఉన్న వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి బయలుదేరి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారు. కార్యాలయంలో ఉన్న పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో నల్లగొండ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.