తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు చేస్తే,,నాకు ఇచ్చిన నోటీసులు ఎలా ఇస్తారు..

*🔹టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ వివరణ..*
_• నాకు ఇచ్చిన నోటీసులు .
ఉపసంహరించుకోవాలి..

సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం తగదు.. నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. కాంగ్రెస్ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉంది.. ఈ వ్యవహారంలో నా ప్రమేయం లేదని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేస్తున్నా-కొండా సురేఖ._.

కొండా సురేఖ వివరణ.. నోటీసులు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి.

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ తన వివరణను సమర్పించారు. తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.

తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని సురేఖ స్పష్టం చేశారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం తగదని పేర్కొన్నారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఆమె అభిప్రాయపడ్డారు..

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని సురేఖ తెలిపారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, అందువల్ల తనపై జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు.