బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ముదిగొండ హరిదాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.. . ..

ఘనంగా బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ముదిగొండ హరిదాస్ జన్మదిన వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ………
బి ఆర్ ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు ముదిగొండ హరిదాస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ హాజరై, ముదిగొండ హరిదాస్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ….హరిదాస్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ జన్మదిన వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యానాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, కౌన్సిలర్లు పొట్ట మురళి, పొట్ట మధు, సర్పంచ్ అడారపు హరికృష్ణ, బొడ్డు మల్లేష్, జమీర్ బాబా, గుండాల వెంకట్, మైనంపల్లి ప్రవీణ్, బత్తుల ఆంజనేయులు,ప్రశాంత్, లడ్డు తదితరులు పాల్గొని ముదిగొండ హరిదాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.