మోదీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్‌పై రూ.32.98 ఎక్సైజ్‌ డ్యూటీ….కేటీఆర్.

మోదీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్‌పై రూ.32.98 ఎక్సైజ్‌ డ్యూటీ…

పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.. అంతర్జాతీయంగా చవక ధరలకు పెట్రో ఉత్పత్తులను కొని అధిక ధరలకు దేశ ప్రజలకు అమ్ముకుంటున్న దళారి ప్రభుత్వం నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అని విమర్శించారు…
2014కు ముందు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48 ఉండేదని, అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం దాన్ని రూ.32.98కి పెంచిందని ఆరోపించారు. గతేడాది కాస్త తగ్గించి దాన్ని రూ.27.90 చేశారని, ఈ ఎక్సైజ్‌ డ్యూటీలో 41 శాతం రాష్ట్రాలకే తిరిగి వస్తుందంటూ కేంద్రమంత్రులతో పాటు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోషల్ మీడియాలో డప్పు కొడుతుందని.. కానీ ఇది పచ్చి అబద్ధమన్నారు. పెట్రోల్ ధరలో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అన్ని రాష్ట్రాలతో పంచుకునేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమేనన్నారు…ఇప్పుడున్న పెట్రో ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఒక రూపాయి 40 పైసలు మాత్రమేనని, ఇందులో నుంచి 41 శాతాన్ని అంటే అక్షరాల 57 పైసల్ని కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు పంచుతుందన్నారు. ఇందులో తెలంగాణ వాటా 2.133 శాతమని.. అంటే లీటరుకు 0.01 పైసలు అని తెలిపారు. కానీ, 28 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ ముక్కుపిండి వసూలు చేస్తున్న మోడీ సర్కార్, అందులో నుంచి ఆఠాణా మాత్రమే రాష్ట్రాలకు ఇస్తూ ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు గప్పాలు కొడుతుందన్నారు.