MLA అరవింద్బాబు తీరుపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం.
పార్టీ అధ్యక్షుడితో పాటు మంత్రులు ఫోన్ చేసినా..
స్పందించకపోవడంతో అరవింద్బాబుపై అసహనం
వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని..
MLA అరవింద్బాబుకు పల్లా శ్రీనివాసరావు ఆదేశం..
టీడీపీ అధిష్టానం మరో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వరుస వివాదాల నేపథ్యంలో ఆ మధ్య తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఘటనపై టీడీపీ అధిష్టానం.. చదలవాడ అరవిందబాబును వివరణ కోరినట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలిసింది..