రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధా చేస్తున్నారు… కేటీఆర్.

కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటన నేపథ్యంలో జనగాం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్న పోలీసులు….

హైదరాబాద్ నివాసం నుండి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు బయలుదేరిన కేటీఆర్….

జనగాం సమీపంలోని పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు..

పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వివాదం….

జనగాం జిల్లా కొమల్ల చెక్ పోస్ట్ వద్ద లారీలు అడ్డం పెట్టి మరోసారి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు…..

ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుంటాము..

రైతాంగానికి నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధా చేస్తున్నారు..

కన్నెపల్లి వద్ద ఒక్క పంప్ ఆన్ చేస్తే పైకి నీళ్లు వచ్చేవి..

ఈ ప్రభుత్వానికి చాతకాకపోతే.. వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి, పంపులు ఆన్ చేసి అన్ని జలాశయాలు నింపి ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాము..

కన్నెపల్లి వద్దకు పోతుంటే జనగామ వద్దే మమ్మల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు.. ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నిస్తే పైనుండి ఆదేశాలని చెబుతున్నారు అని కేటీఆర్ అన్నారు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌజ్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ బృందాన్ని జనగాం జిల్లా పెంబర్తి వద్ద బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది…ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సర్కార్ వైఫల్యం బయటపడుతోందనే మమ్మల్ని అడ్డుకుంటున్నారని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి సందర్శనకు వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను, సర్కార్ చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలకు చూపెడతామని అన్నారు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండగట్టే కుట్రలు చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగడతామని అన్నారు..