పథకం పెట్టేటప్పుడే అన్ని ఆలోచించాలి..కేటీఆర్.

పథకం పెడితే ముందూ, వెనుకా చూసుకొని.. అన్నీ సరిగ్గా ఉన్నాయా, లేదా చూసుకొని పెట్టాలి తప్ప, ఏదో చేసినమా అంటే చేసినం అనే దానికి ఆగమాగం చేయకూడదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అన్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఈ పథకం వల్ల ప్రజలు దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పథకాలు ప్రవేశపెట్టే ముందు అన్నీ ఆలోచించుకోవాలని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. శనివారం (జనవరి 27) హైదరాబాద్‌లో పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్‌’లో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు..