బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ …కేటీఆర్..

2025 – 2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లికి మూటలు పంపే బడ్జెట్ …కేటీఆర్.

ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న ..ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు ..6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం..అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ..ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ ..ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి ..మూటలు పంపడం పైననే దృష్టి ..ప్రజల కష్టాలు పైన ధ్యాస లేని బడ్జెట్..ప్రజాధనాన్ని పార్టీ పంచిపెట్టే కుట్ర .ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే..ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్..ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది – ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుంది…ప్రభుత్వ అందమే సక్కగా లేదు అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం…రంకెలు కాదు రేవంత్ రెడ్డి – అంకెలు ఎక్కడ పోయినై …ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది..
పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్..ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు గోవిందా, పాతర వేశారు…మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు…