*సీఎం రమేష్ ఆరోపణల పై స్పందించిన కేటీఆర్*
*సీఎం రమేష్ – సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే..*
HCU రూ.10000 కోట్ల స్కాం పైనా..
ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి చర్చకు నేను సిద్ధం
సీఎం రేవంత్.. .సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం నేను బయటపెట్టడంతో కుడితిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారు
HCU భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న.. లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు.
నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కోసం పనికి రాని కథలు చెబుతున్నారు
రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య
నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది
ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నరు..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల అమ్మకం విషయంలో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ భూములపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ భూముల అమ్మకం వ్యవహారంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (BJP MP CM Ramesh), సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) సహాయం చేశారన్నారు. అందుకు బదులుగా సీఎం రమేశ్ కు రూ.1600 కోట్ల విలువైన కాంట్రాక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కట్టబెట్టారని ఆరోపించారు. కేటీఆర్ కామెంట్స్ పై సీఎం రమేశ్ తాజాగా స్పందించారు. కేటీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ సర్కారు అమ్మకానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూములు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ముఖ్యమైనవని, వీటిని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని విద్యార్థులు, పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ భూములను తాకట్టు పెట్టి రూ.10,000 కోట్ల రుణాలు పొందేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రక్రియలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సహకారం ఉందని, ఆయనకు ప్రతిఫలంగా రూ.1,600 కోట్ల విలువైన ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందనే అనుమానాలను రేకెత్తించాయి…