మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఇ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జూన్ 16, సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. మే 26నే ఎంక్వైరీకి రావాలని గతంలో నోటీసులు ఇవ్వగా.. అప్పుడు విదేశీ పర్యటన ఉందని.. వచ్చాక వస్తానని కేటీఆర్ అన్నారు. దాంతో ఈసారి జూన్ 16న రావాలంటూ మరోసారి నోటీసులు ఇష్యూ చేసింది ఏసీబీ…ఇ-కార్ రేసు వ్యవహారంలలో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం.. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం.. వంటి వ్యవహారాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.