మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఏకపక్షంగా వ్యవహరిస్తూ వివక్షత ప్రదర్శిస్తున్న మోతె ఎస్సైని సస్పెండ్ చేయాలి..బాధితురాలు లచుమళ్ళ రమణమ్మ.
హిందూ మత సాంప్రదాయాల ప్రకారం తాము మొక్కు తీర్చుకోవడానికి తమ ఇంటి ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి పండుగ చేసుకున్నందుకు తమ పైన కేసు నమోదు చేసిన మోతే ఎస్సై పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని బాధితురాలు లచ్చుమల్ల రమణమ్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం సూర్యాపేటలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ చిన్న కూతురు వివాహము జూన్ 6వ తారీఖున నిశ్చయమైందని, తమకు ఉన్న దేవుని మొక్కు ప్రకారము తమ సొంత గ్రామమైన మోతే మండల కేంద్రంలో ఎల్లమ్మ దేవత పండగ చేసుకుంటూ ఉండగా తమ బంధువులైన క్రిస్టియన్ మతానికి చెందిన బావ,మరుదులు అయిన లచ్చుమల్ల వెంకటయ్య, లచ్చు మల్ల శ్రీనివాస్ (కానిస్టేబుల్), లచ్చు మల్ల స్వప్న (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) యశోద, లచ్చు మల్ల రాజు (రౌడీ షీటర్) కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్లకుండా కంచె వేసి అడ్డుపడ్డారన్నారు. ఈ విషయంలో ఎల్లమ్మ పండుగ చేసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా వారే వంద నెంబర్ కు కాల్ చేశారని, తాము ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నామని ఎస్సై కి విన్నవించినా పెడచెవిన పెట్టి తమ పైననే కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తాము పండుగ కోసం డప్పులు కొట్టే వారిని, యాటలు కోసేవారిని పిలిపించగా తమ బావ, మరుదులు కానిస్టేబుల్ శ్రీనివాస్ ‘పోలీసుల ద్వారా పండగకు సహకరించిన అందరిపై కేసులు పెట్టిస్తామని’ బెదిరిస్తూ డప్పులు కొట్టవద్దని, యాటలు కోయవద్దని అక్కడి నుంచి తీసుకెళ్లారని, పండుగ జరుగుతుండగా కరెంటు లైట్లు బందు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహా నిశ్చితార్థము జరుగగా తమ అల్లుడు, కూతురు కలిసి మోతే వచ్చి ఎల్లమ్మ దేవతను మొక్కుతుండగా తన బావ, మరుదులు వచ్చి అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యం చేసి, భౌతికంగా అడ్డుకొని నెట్టివేస్తూ చంపుతామని భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. సత్యం కుమారుడు లచ్చుమల్ల రాజు కు కానిస్టేబుల్ శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి బాగా త్రాపించి తమను చంపమని ఉసి గొలిపాడని, ఫోన్లో చంపుతామని బెదిరించిన ఆడియో సాక్ష్యం కూడా తమ వద్ద ఉందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి సంఘటన పట్ల ఎలాంటి విచారణ చేయకుండానే ఏకపక్షంగా వ్యవహరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని స్టేషన్ కి వెళ్ళిన తమను దూషించారని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమకు రావాల్సిన భూమి కూడా రాకుండా అడ్డుకోవడమే కాకుండా తమను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయంలో పోలీసు ఉన్నత అధికారులు తగు విచారణ చేసి మోతె ఎస్సై యాదవేందర్ రెడ్డి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని భూమిని అక్రమంగా అక్రమించి తమను గత కొంత కాలంగా వేధిస్తూ చంపుతామని బెదిరిస్తున్న తన బావ మరుదులు, కానిస్టేబుల్ లచ్చు మల్ల శ్రీనివాస్, రౌడీ షీటర్ రాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో తమకు న్యాయం జరగపోతే తమకు చావే శరణ్యమని లచ్చు మల్ల రమణ ఆవేదన వ్యక్తం చేశారు.