ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ..!

హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్‌రావు నివాసంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ అయ్యారు. నీటి పారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హరీశ్ రావు ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అగ్రనేతల వరుస సమావేశాలతో పార్టీలో ఏదైనా మార్పులు సంభవించబోతున్నాయా లేక ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై చేయాల్సిన పోరాటంపై ఏదైనా చర్చిస్తున్నారా అనేది ఉత్కంఠగా మారింది.