తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోంది..50వేల కంటే ఎక్కువ ఓట్లతో రేవంత్‌ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: కేటీఆర్‌..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. కొండగల్‌ శాసనసభ్యత్వానికి రేవంత్‌ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలన్నారు..ఉప ఎన్నికలో తాము ప్రచారం చేయమని చెప్పారు…. ఫలితాల్లో 50వేల కంటే ఎక్కువ ఓట్లతో రేవంత్‌ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా కేటీఆర్‌ వెల్లడించారు. అంతకుముందు కొడంగల్‌లో భారాస రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) విమర్శించారు. కొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు..రేవంత్‌ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదు. అనుముల అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచేస్తున్నారు. రూ.కోట్లు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్‌ ప్రజలు ఆశించారు. కానీ, రేవంత్‌ ప్రజల కోసం పనిచేయడం లేదు. భూములు గుంజుకోవాలనేదే ఆలోచన. రైతు బంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా?’ అని ప్రశ్నించారు..