నీళ్ల మంత్రి, నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు:- సూర్యాపేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్.
సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన చేయడం జరిగింది.. ఈ పర్యటనలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ..
*తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం.*
*కెసిఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు.*
*ఎస్ ఎల్ బి సి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడు*
*ప్రతీ గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి*
*గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి*
*కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించేందుకు మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇవాళ సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్నుల కొద్ది అభిమానం అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉందన్నారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరమే అన్న కేటీఆర్, అందుకు ఏప్రిల్ 27న తొలి అడుగు పడబోతుందన్నారు.*
*కేటీఆర్ మాట్లడుతూ…
దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేది. దాన్ని మార్చిన నాయకుడు NTR.
ఒక పార్టీ పెట్టి భారత దేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు.
ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్.
భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బిఆర్ఎస్ ఒకటి.
కెసిఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోనీ వాళ్ళు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు.
వాన పాములు నాగుపాముల లెక్క బుసలు కొడుతున్నాయి.
తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాయి.
100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు ఇంకోవైపు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన తెలంగాణ ప్రజా సమితి ని చూసిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం చచ్చిపోయింది.
కానీ 2001లో ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్. ఇదే చరిత్ర.
కెసిఆర్ గారు లేకపోతే గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు.
ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ గారి నాయకత్వం తోడై విజయం సాధించాం.
25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపించాం.
ప్రజాస్వామ్య బద్దంగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని దేశ ప్రజలకు నిరూపించిన పార్టీ బిఆర్ఎస్
అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటుు చూపిస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది.
ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా.
మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు.
తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసం.
చరిత్రలో ఒక అనివార్యమైన సందర్భంలో బీఆర్ఎస్ పుట్టింది.
తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నాం.
కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ పీడ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడేందుకే మళ్లీ బి ఆర్ ఎస్ అధికారంలోకి రావాలి.
ఫీనిక్స్ పక్షిలాగా బిఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కుతున్నారు.
ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరాడుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
ముఖ్యమంత్రి ది ఒక వికృతమైన మనస్తత్వం.
చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది.
ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు ఏం లేదు.
అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడు అంశాలే బిఆర్ఎస్ ఓటమికి కారణం.
యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడు.
100కు 100% రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదు.
రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయి.
కెసిఆర్ గారు కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతుబంధుకి రామ్ రామ్ అయితదని ముందే చెప్పిండు.
నీళ్ల మంత్రి , నల్లగొండలోని ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారు.
ఎస్ ఎల్ బి సి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడు.
అధికారం మాత్రమే పోయింది ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉంది.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది
అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చింది.
కెసిఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదు.
కెసిఆర్ కట్టిన కాలేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదు.
కెసిఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు.
ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం.
రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారింది.
కృష్ణానదిలో 36% నీళ్లను కేసీఆర్ గారి ప్రభుత్వం వాడుకుంది. కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24% నీళ్లను కూడా వాడుకోలేదు.
నీళ్లు వాడుకునే తెలివి లేదు. నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు. చెరువులనునింపే తెలివి లేదు.భూగర్భ జలాలను పెంచే తెలివి లేదు.
కాంగ్రెస్ వైఫల్యాలను బిజెపి ప్రశ్నించదు. బడే భాయ్ మోడీ చోటే బాయ్ రేవంత్ మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది.
తెలంగాణకు గొంతుగా బిఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్ బిజెపిల ఉమ్మడి లక్ష్యం.
కెసిఆర్ తెలంగాణ పక్షం కాంగ్రెస్ బిజెపి ఢిల్లీ పక్షం.
రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు.
ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలి.
కాంగ్రెస్ బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలి.
జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు.
స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవు. స్పీకర్ పదవి అంటే బిఆర్ఎస్ కు ఎంతో గౌరవం. ప్రసాద్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉంది.
శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదు.
మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ?
పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గారి గులాబీ దండు మాత్రమే.
ప్రతి గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి.
గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి.
వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుంది.
కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందాం. గ్రామస్థాయి వార్డు స్థాయి , బూత్ స్థాయి ,రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందాం.
కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదు.
పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తాం.
చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలి.
బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కెసిఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడు లాగా విజృంభించాలి.
ఏప్రిల్ 27 నాడు దానికి తొలి అడుగు పడాలి. ఈ సంవత్సరం అంతా టిఆర్ఎస్ పోరాటనామ సంవత్సరం.