సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదు.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు..మరి ఇది అసెంబ్లీ.. గాంధీ భవన్ కాదు అన్న ఎంఐఎం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా..? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవు. స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవం. ప్రసాద్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉంది. శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా..? పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గులాబీ దండు మాత్రమే అని కేటీఆర్ తెలిపారు..