కారుకు ఓటు.. బుల్డోజర్కు గెటౌట్..కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలి.. కేటీఆర్.
కారుకు ఓటు.. బుల్డోజర్కు గెటౌట్ పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు..
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి రెండేండ్లలో ఒక మాట కూడా నిలబెట్టుకోని రేవంత్రెడ్డి ఇప్పుడు జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేస్తామంటే ఎవరూ నమ్మబోరని స్పష్టం చేశారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే రేవంత్రెడ్డి నిధులు ఇవ్వట్లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా? అని ప్రశ్నించారు. ‘కత్తి కాంగ్రెస్కు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేయాలి. కత్తి మాకు ఇవ్వండి బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్యత మాది. బుల్డోజర్ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటే మళ్లీ కేసీఆర్ వస్తారు’ అని పిలుపునిచ్చారు. మూడో నంబర్పై ఉన్న కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడలో ఆదివారం మధ్యాహ్నం కేటీఆర్ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి అమరావతి పబ్లిక్ స్కూల్లో తాను చదువుకున్నానని, ఇక్కడి పరిస్థితులు తెలుసని అన్నారు