కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు..!

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ABC ప్రింటింగ్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో పెయింట్లు, కెమికల్స్, కాగితపు నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఆకాశాన్ని తాకేలా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పలు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు..

ప్రమాదాన్ని గమనించిన పరిశ్రమ కార్మికులు, స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్ లోపల ఉన్న పెయింట్స్, రసాయనాల వల్ల మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, వాటిని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు..

ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.