కువైట్ లో అమెరికా వైమానిక స్థావరంగా ఉన్న అల్ అలీ సలీం ఎయిర్ బేస్ తగలబడి పోతోంది.
ఇరాన్ క్షపణి దాడులు ఈ వైమానిక స్థావరాన్ని నాశనం చేశాయి. బహ్రెయిన్ లో అమెరికన్ మిలిటరీ అధికారులున్న హోటల్ పై కూడా ఇరాన్ క్షిపణి దాడి జరిగింది. హాటల్లో మంటల్లో చిక్కుకుంది. అమెరికా కుటిల యుద్ధ నీతికి ముస్లిం దేశాలే కొట్టుకుని తగలబడుతున్నాయి. ట్రంప్ ఇలా చిచ్చుబెట్టి మారణ హోమంతో తమాషా చూస్తున్నాడు..
ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దళాల యుద్ధం ఏడో రోజుకు చేరింది. తమ దేశంపైకి వస్తున్న మిసైళ్లు, రాకెట్లు, బాంబులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్, ఏమాత్రం తగ్గకుండా దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్, అజర్బైజాన్, ఒమన్పైనా విరుచుకుపడింది. అటు ఇరాన్ నాయకత్వాన్ని లొంగిపోవాలని ఇజ్రాయెల్-అమెరికా హెచ్చరించినా వినకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలోనే ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్-IDF ప్రకటించింది. ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో గత 100 గంటల్లో ఇరాన్‌లోని 750కి పైగా ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్టు తెలిపింది. ఇరాన్‌లోని ప్రస్తుత నాయకత్వాన్ని, సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడమే తమ లక్ష్యమని IDF చెప్పింది..