వాంగ్ చుక్ అరెస్ట్..లద్దాఖ్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారటానికి ప్రధాన కారకుడు..!

భారత్‌లో ఇప్పటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. దీంతో ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో భారీగా భద్రతా దళాలు మోహరింపు హింస చెలరేగకుండా ఆపగలిగారు..

లద్దాఖ్ ఉద్యమ నేత సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్ అయ్యారు. ఆందోళనకారులను వాంగ్ చుక్ రెచ్చగొట్టారని కేంద్ర హోంశాఖ ఇప్పటికే తెలిపింది. లద్దాఖ్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారటానికి ప్రధాన కారణం వాంగ్ చుక్ అని తెలిపింది కేంద్ర హోంశాఖ. హింసాత్మక ఘటనల్లో నలుగురు మృతి చెందగా, సుమారు 70 నుంచి 80 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. దీనంతటికి వాంగ్ చుక్ కారణం అంటున్నారు. అతడు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోతోనే అక్కడంతా హింస చెలరేగిందని అంటున్నారు. అందరూ రోడ్లపైకి వచ్చేసి అల్లర్లకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ తెలిపింది. సోనమ్ వాంగ్ చుక్ ఎన్జీఓ లైసెన్స్ ను కూడా రద్దు చేసింది కేంద్రం…లేహ్ లద్దాఖ్ లో అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారి అంటూ వాంగ్ చుక్ కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను లేహ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్జీవో పేరు మీద విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వాటిని వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించినట్లుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అల్లర్ల వెనుక వాంగ్ చుక్ ప్రత్యక్షంగా ఉన్నారని చెబుతున్నారు. తన ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం లద్దాఖ్ లో అల్లర్లు జరిగాయి. లద్దాఖ్ కు ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు. దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఈ హింసాత్మక ఘటనలకు వాంగ్ చుక్ కారణం అంటూ ఆయనని అరెస్ట్ చేసింది. యువతను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణం అయ్యారనే ఆరోపణలతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్ చుక్ ను అదుపులోకి తీసుకున్నారు. 2019లో లద్దాక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు వాంగ్‌చుక్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని ఆయన పోరాటం చేస్తున్నారు..లద్దాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఇటీవల నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, హింస చెలరేగడంతో తన 15 రోజుల నిరాహార దీక్షను ఆయన విరమించుకున్నారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోటో...


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న..
బంగ్లాదేశ్ ప్రధానితో వాంగ్ చుక్ పోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…
లడఖ్‌లో బంద్ మధ్య జరిగిన విస్తృత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు మరణించగా, 80 మందికి పైగా గాయపడిన ఒక రోజు తర్వాత, లేహ్‌లో కర్ఫ్యూ విధించబడింది. నిరాహార దీక్షకు నాయకత్వం వహిస్తున్న వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) బంద్‌కు పిలుపునిచ్చిన కార్గిల్‌తో సహా ఇతర ప్రధాన పట్టణాల్లో కూడా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమవడాన్ని నిషేధించే కఠినమైన నిషేధ ఆంక్షలు విధించబడ్డాయి..