నందమూరి బాలకృష్ణపై శ్యామల ఘాటు వ్యాఖ్యలు

Anchor Shyamala | టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి “సైకో గాడు” అంటూ బాలకృష్ణ(TDP MLA Nandamuri Balakrishna) చేసిన వ్యాఖ్యలు అసభ్యకరమని ఆమె గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు.

రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు.

బాలకృష్ణకు గతంలో వైఎస్ కుటుంబం అండగా నిలిచిందని గుర్తు చేసిన శ్యామల(Anchor Shyamala), “మీ ఇంట్లో కాల్పుల ఘటన జరిగినప్పుడు మిమ్మల్ని ఆ కేసు నుంచి కాపాడింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ విషయం ఇలా మరిచిపోవచ్చా?” అంటూ ప్రశ్నించారు…

‘వైయస్ జగన్ గారిని “సైకో గాడు” అంటూ దూషించిన మెంటల్ సర్టిఫికెట్ హోల్డర్ బాలకృష్ణ గారు.. మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడింది నాటి ముఖ్యమంత్రి వైయస్సార్ గారు అన్న విషయం అప్పుడే మర్చిపోయారా..? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. మీరు నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి.. మీ బావగారు చంద్రబాబు గారు గతంలో పెట్టిన కోట్లాది రూపాయల బకాయిలను ఆరోగ్యశ్రీలో భాగంగా విడుదల చేసింది నాటి వైయస్సార్సీపి ప్రభుత్వం అనే విషయం మర్చిపోయారా..?’ అని శ్యామల X లో పోస్టు చేశారు.