మహిళా కానిస్టేబుల్ హత్య తీవ్ర కలకలం..

ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే అతికిరాతకంగా నరికి చంపేశాడు. సమాచారం అందిన వెంటన పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ కొడవలిని సీజ్ చేశారు. కాగా.. గత 15 రోజుల క్రితమే కానిస్టేబుల్ నాగమణి కులాంతర ప్రేమ వివాహం చేసుకుంది. ఈరోజు ఉదయం విధులు నిర్వర్తించేందుకు హయత్‌నగర్‌కు బయలుదేరగా.. వారి స్వగ్రామం రాయపోలు సమీపంలో హత్యకు గురైంది. నాగమణిని కారుతో ఢీ కొట్టి కత్తితో దాడి చేయడంతో… నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నాగమణిని తమ్ముడు పరమేష్ అత్యంత దారుణంగా హత్య చేశాడు.అయితే ఆస్తి కోసమే అక్కను తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రస్తుతం నిందతుడు పరమేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు..

తమ్ముడే హంతకుడు..!

ప్రేమ వివాహం చేసుకున్న మహిళా కానిస్టేబుల్ పాలిట సొంత తమ్ముడే యముడయ్యాడు. నెల రోజుల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకోవటాన్ని జీర్ణించుకోలేక పోయిన ఆమె సోదరుడు.. విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి, వేట కొడవలితో అక్కను దారుణంగా హత్య చేశాడు..