సర్వీస్ రివాల్వర్‌‌లో కాల్చుకుని ఎస్సై మృతి…!

సర్వీస్ రివాల్వర్‌‌లో కాల్చుకుని ఎస్సై మృతి..

ములుగు జిల్లా.

సర్వీస్ రివాల్వర్‌ తో కాల్చుకుని ఓ ఎస్సై ప్రాణాలు విడిచిన విషాద ఘటన ములుగు జిల్లా లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రుద్రారపు హరీశ్ ఎస్సై‌గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌ లో హరీశ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.

ములుగు జిల్లాలో నిన్న ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం లేపుతుంది, ఉన్నంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు..

నిన్న ఉదయం ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిన హరీశ్… రిసార్ట్స్ లో గది అద్దెకు తీసుకున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో… వారు వాజేడు పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. రిసార్ట్స్ కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా… ఆయన విగతజీవిగా కనిపించారు.

పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే ఆయన ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది..