ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ…!

ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.

పలువురిని వ్యక్తిగతంగా దూషించి, కులాల పేరుతో అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ చేసిన క్రమశిక్షణ కమిటీ..

కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనపై పార్టీ నాయకత్వం సీరియస్‌గా స్పందించింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రభాకర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టమైన సంకేతం ఇచ్చింది…