హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ ప్రాంతంలో భారీగా దోమలు గుంపులు..

లంగర్‌హౌజ్‌లో భారీగా పెరిగిన దోమలు.. స్థానికుల్లో ఆందోళన

హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ ప్రాంతంలో దోమల బెడద భారీగా పెరిగింది. దోమలు గుంపులుగా తిరుగుతున్న దృశ్యాలను ఓ స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కలకలం రేపుతోంది.

దోమల తీవ్రత కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య లోపాలు, కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే దోమల వృద్ధి పెరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

దోమల నివారణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, కాలువలను శుభ్రం చేసి ఫాగింగ్, యాంటీ-లార్వా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.