జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..
ఇన్‌ఫ్లో 21 వేలు, ఔట్‌ఫ్లో 17,676 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 316.500 మీటర్లు
పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు
ప్రస్తుత నీటినిల్వ 6.081 టీఎంసీలు
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన ట్రంప్..
*పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.*
ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్ క్షిపణులను కొనసాగిస్తే టెహ్రాన్ తగలబడిపోతుందని వార్నింగ్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్‌పై ప్రతీకారంగా ఇరాన్ దాడులు. ఇరాన్ దాడుల్లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు…..
తక్షణమే రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోవాలి..ఇరాన్,ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి ప్రయత్నిస్తున్నా
త్వరలోనే శాంతి ఒప్పందం ఏర్పడుతుంది.
నా మధ్యవర్తిత్వంలో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొంది.అయినా నేనెప్పుడూ ఆ క్రెడిట్ తీసుకోలేదు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.
ఇన్‌ఫ్లో 22,860 క్యూసెక్కులు
ప్రస్తుత నీటిమట్టం 841.50 అడుగులు
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
శ్రీహరికోట:
షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు
చెన్నై CISF కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్
శ్రీహరికోటలో అప్రమత్తమైన భద్రతా బలగాలు
షార్ కేంద్రంలో అణువణువునా బలగాల గాలింపు
ఫేక్ కాల్‌గా నిర్ధారించిన అధికారులు….
కొనసాగుతున్న DNA పరీక్షలు.. 47 మృతదేహాలు గుర్తింపు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాతో పోల్చి చూసే ప్రక్రియ మూడు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 47 మందిని గుర్తించగా.. 24 మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు..
కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు అద్భుతమైన వరం.బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్.
కాళేశ్వరం వల్ల తెలంగాణకు 100 శాతం ఉపయోగం ఉంది..
ఇవాళ ఎండాకాలంలో కూడా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో కూడా నీళ్లు పరవళ్ళు తొక్కుతున్నాయి..కాళేశ్వరం పై ప్రతి చిన్న అంశాన్ని కేబినెట్లో చర్చించాము
కేబినెట్ ఆమోదం లేకుండా ఏమీ జరగలేదు అన్నారు…
తెలంగాణ భవన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్
ఫార్ములా-ఈ రేస్ కేసుపై మరి కాసేపట్లో ఏసీబీ ముందు విచారణకు హాజరు కానున్న కేటీఆర్….
ఇప్పటికీ 3సార్లు పిలిచారని, 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా.. కేటీఆర్.
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరచి, విచారణలు, కమిషన్లంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ కేసు ఏసీబీ విచారణకు హాజరైన ఆయన, అంతకు ముందు మీడియాతో మాట్లాడారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై గౌరవం ఉందన్న కేటీఆర్, విచారణకు ఎన్నిసార్లైనా వస్తానని చెప్పారు. ఇప్పటికీ 3సార్లు పిలిచారని, 30 సార్లు పిలిచినా విచారణకు వస్తానని పేర్కొన్నారు. కేసులు పెట్టి ఇబ్బందిపెట్టినంత మాత్రాన ప్రశ్నించడం మానుకోమని చెప్పారు.
పైశాచిక ఆనందం పొందారు : కేసీఆర్, హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ ఎదుట కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఏసీబీ విచారణకు పిలిచి మానసిక, రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే అరెస్టు చేస్తారు కావచ్చన్న ఆయన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం గతంలో జైలుకు వెళ్లొచ్చినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశామన్న ఆయన, అందుకు తీసుకున్న నిర్ణయాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడేది లేదని, ఒకసారి కాదు, వందసార్లైనా జైలుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసేవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు…
మా కార్యక్రమాలకు వస్తే అరెస్టు చేయిస్తానంటూ TNEWS జర్నలిస్టును బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి.
ప్రజలు తమపై తిరగబడే వీడియోలు చిత్రీకరిస్తున్నారని, ఇంకోసారి తమ కార్యక్రమాలకు వస్తే కేసు పెట్టీ అరెస్టు చేయిస్తానని జర్నలిస్టును బెదిరించిన యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి….
మా వార్తలు రావు, మా వీడియోలు తీసి బయటకు ఎందుకు వేస్తున్నావ్.. మరోసారి మా ప్రోగ్రాం లో కనపడితే నీ పై కేసు పెట్టి లోపల వైపు ఇస్తానంటూ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..