స్కిన్ లెస్ చికెన్ తింటున్నారా?
ప్రస్తుతం చాలా మంది స్కిన్ లెస్ చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ చికెన్‌ను స్కిన్‌తో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ స్కిన్‌లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. స్కిన్‌లోని కొల్లాజెన్ చర్మం, వెంట్రుకలు, గోర్ల సంరక్షణకు మేలు చేస్తుంది. స్కిన్ నుంచి వచ్చే అదనపు నూనె వల్ల వంటనూనె వినియోగం తగ్గుతుంది..
బాచుపల్లిలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
బాచుపల్లిలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పరిధి మిథిలానగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు గమనించిన నివాసితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ ప్రమాదంలో ఏసీకి మంటలు అంటుకుని మరింత విస్తరించాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. కాగా విద్యుదాఘాతంతో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
నేటి నుంచి టెట్ పరీక్షలు..!!
హైదరాబాద్, జూన్ 18 పాఠశాల విద్యాశాఖ నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని ఏర్పాట్లు పూర్తచేశామని టీజీటెట్ చైైర్‌పర్సన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.
పరీక్షకు మొత్తం 1,83,653 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో పేపర్-1 కోసం 63,261, పేపర్-2 కోసం 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదికి సంబంధించి ఇది మొదటి పరీక్ష కానుంది..
*_Rythu Bharosa: కొత్త రైతులకూ ‘భరోసా’!_*
జూన్ 5లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలు
ఏఈవోలకు ధ్రువపత్రాలు ఇస్తే పోర్టల్‌లో నమోదు
ఈ నెల 20వ తేదీ వరకు గడువు మూడు ఎకరాల వరకు రైతుభరోసా జమ!
కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెల 5ను కటాఫ్ తేదీగా పెట్టారు. అంటే ఈనెల 5లోపు క్రయవిక్రయాలు, మ్యుటేషన్ జరిగి, యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసాను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ వానాకాలం (2025-26) సీజన్‌కు వచ్చేసరికి పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసాను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. భూభారతి(ధరణి) పోర్టల్ ప్రకారం… రిజిస్ట్రేషన్ ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా చెల్లించాలని, యాజమాన్య హక్కులు పొందిన రైతుల వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
అయితే 2023-24లో 6,32,898 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2024-25లో 5,87,313 భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో కొందరు రైతులు రైతు భరోసా పథకంలోకి వచ్చారు. మరికొందరు రైతులను పథకంలో చేర్చలేదు. ఇప్పుడు వారందరికీ అవకాశం కల్పించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఏఈవోలు (వ్యవసాయ విస్తరణాధికారులు) రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. సీసీఎల్ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి ధ్రువపత్రాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు, బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను ఏఈవోలకు ఇస్తే… వారు రైతు భరోసా పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేస్తారు. ఈ వివరాల నమోదుకు ఈ నెల 20 వరకు గడువు ఇచ్చారు. అంటే మూడు రోజుల సమయం ఉంది. ఈ మూడు రోజుల్లో కొత్త రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్లు లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు.
3 ఎకరాల వరకు రైతుభరోసా జమ!..
*_రైతుల ఖాతాలకు 1,552 కోట్లు బదిలీ_*
*_2 రోజుల్లో రూ.3,902 కోట్ల నగదు_*
మూడెకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులకు వారి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మూడెకరాల భూమి గల రైతులు 10.45 లక్షల మందికి 25.86 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎకరానికి రూ.6,000 చొప్పున 10.45 లక్షల మంది రైతులకు రూ. 1,552 కోట్ల నగదు బదిలీ చేశారు. తొలి రోజు సోమవారం రెండెకరాల్లోపు భూమి గల 41.25 లక్షల మంది రైతులకు 39.16 లక్షల ఎకరాలకు రూ.2,350 కోట్ల నగదును సర్కారు బదిలీ చేసింది.రెండు రోజుల్లో (16,17 తేదీల్లో)నే రాష్ట్ర ప్రభుత్వం 51.70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.3,902 కోట్ల నగదును బదిలీ చేసింది. ఎటువంటి పరిమితుల్లేకుండా రైతులందరికీ రైతు భరోసా చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. సుమారు 1.50 కోట్ల ఎకరాల భూమికి ప్రస్తుత సీజన్లో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాజీవ్ యువ వికాసం పథకం నిలిపివేత!.
తెలంగాణ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చుల మధ్య అంతరం నెలకు రూ.9,000 కోట్లకు పెరుగుతుండడంతో కొత్త సంక్షేమ పథకాల అమలును నిలిపివేయనుంది. ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు రూ. 50,000 నుంచి రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని గతంలో నిర్ణయించింది…
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ పంపి బెదిరించిన ఆగంతకులు
అప్రమత్తమైన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు.
ఎయిర్పోర్ట్ ఉద్యోగులు, సిబ్బంది బైటకు తరలింపు
రంగంలోకి దిగిన స్నిఫ్ఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్
ఎయిర్‌పోర్ట్‌ను అణువణువు గాలిస్తున్న జాగిలాలు, బాంబ్ ఎక్స్ ప్లోజివ్ ఎక్స్ పర్ట్స్
అత్యవసర సహాయక సిబ్బందిని సైతం రప్పించిన ఎయిర్పోర్ట్ అథారిటీ
దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం అధికారులు
మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు ప్రారంభం…
పాక్ ఆర్మీ చీఫ్ తో లంచ్ మీటింగ్ వేళ.. ట్రంప్ కు మోదీ ఫోన్ కాల్..సుమారు 35 నిమిషాల పాటు వారి మధ్య ఈ ఫోన్ సంభాషణ..
పహల్గామ్ లో భయానక ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు..ఈ మధ్యాహ్నం వైట్ హౌస్ లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి భోజనం చేయనున్నారు.
దీనికి సంబంధించిన షెడ్యూల్ ను వైట్ హౌస్ కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ రోజువారీ కార్యక్రమాలతో కూడిన అధికారిక ప్రకటనను వెలువడించింది. డొనాల్డ్ ట్రంప్ పాల్గనబోయే మూడు అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచింది వైట్ హౌస్.
ఉదయం 9 గంటలకు ఇన్- టౌన్ పూల్ కాల్ టైమ్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో ఫ్రెంచ్ రాయబారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు ట్రంప్. అనంతరం మొనాకో ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆ తరువాత అసీమ్ మునీర్ తో సమావేశమౌతారు.
అనంతరం ఒంటిగంటకు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ తో కలిసి డొనాల్డ్ ట్రంప్ మధ్యాహ్నం భోజనం చేస్తారని వైట్ హౌస్.. రోజువారీ షెడ్యూల్ లో పొందుపరిచింది. నిజానికి ఇది క్లోజ్డ్ – డోర్ మీటింగ్. మీడియాకు కూడా ఇందులో ప్రవేశం లేదు. భోజనానంతరం పలు అంశాలపై చర్చిస్తారు.
డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ రూమ్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ ప్రైవేట్ లంచ్ కు మీడియాకు ప్రవేశం లేదు. దీని తరువాత అసీమ్ మునీర్.. తన పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ లతో కూడా సమావేశం కానున్నారు.
ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని మోదీ. సుమారు 35 నిమిషాల పాటు వారి మధ్య ఈ ఫోన్ సంభాషణ కొనసాగింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో భయానక ఉగ్రవాదుల దాడి అనంతరం.. ఆయనతో మోదీ ఫోన్ లో మాట్లాడటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాక్ పై ప్రతీకార దాడుల కోసం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అంశం ఈ సందర్భంగా వారి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది. దీన్ని చేపట్టడానికి గల కారణాలను మోదీ వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అలాగే- పాక్ తో యుద్ధాన్ని కొనసాగించడం లేదా నిలిపివేసే విషయంలో ఏ స్థాయిలో కూడా తాము ఎవరి సహాయాన్ని గానీ, మధ్యవర్తిత్వాన్ని గానీ కోరలేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తాము ఎప్పుడూ అడగలేదని మోదీ వివరించినట్లు మిస్రీ పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరపలేదని అన్నారు.
పాకిస్తాన్ అభ్యర్థన మేరకే సైనిక చర్యను నిలిపివేశామని డొనాల్డ్ ట్రంప్ కు మోదీ వివరించినట్లు మిస్రీ తెలిపారు. ఇరు దేశాల ఆర్మీ చీఫ్ స్థాయి హాట్ లైన్ సంభాషణలో సైనిక చర్య నిలిపివేత అంశం ప్రస్తావనకు వచ్చిందని, పాక్ అభ్యర్థన మేరకే దాడులను నిలిపివేమని పేర్కొన్నారు..