మరోసారి రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ సర్కార్..
ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతకు కారణంగా మారింది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కంపెనీకి చెందిన వాహనాలను తగలబెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ పనులు ప్రారంభించేందుకు అక్కడికి వచ్చిన గాయత్రీ కంపెనీకి చెందిన వారిని అడ్డుకున్నారు..
https://www.facebook.com/share/v/1MCF1uRGjA/
ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసిన రైతుల చేతులకు సంకెళ్లు
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ కోర్ట్ వద్ద పెద్ద ధన్వాడ ఇథనాల్ కంపెనీ ఆందోళన కేసులో అరెస్ట్ అయిన వారికి సంకెళ్లు
ఈరోజు రిమాండ్ ముగియడంతో అలంపూర్ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
కోర్ట్ వద్దకు తీసుకొచ్చిన సందర్బంలో సంకెళ్లు..