నేటి ప్రధాన వార్తలు…

తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం!

తెలంగాణలోని 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. 14 గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని, ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, మహారాష్ట్రలోనే ఓటు వేస్తారన్నారు. కానీ, సరిహద్దు వివాదాల గురించి నేను మాట్లాడటం సముచితం కాదన్నారు..

బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు.

125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.

125 యూనిట్ల లోపు కరెంటు బిల్లులను చెల్లించనక్కర్లేదని వెల్లడించారు..

*సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి*

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, క్యూలైన్ల నిర్వహణ, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, వలయ రహదారి, పాతాళ గంగ మొదలైన ప్రదేశాలను తరచుగా సి.సి. కెమెరాల ద్వారా ఈఓ శ్రీనివాస రావు పరిశీలిస్తుంటారు.

అయితే గురువారం వేకువ జామున ఈ.ఓ సుమారు గం. 2.00ల సమయంలో అకస్మాత్తుగా నిద్ర నుంచి మెలుకువ రావడంతో క్యాంపు కార్యాలయం నుంచి సి.సి. కెమెరా పుటేజీలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలయ శుద్ధి కార్యక్..

ఈ ఏడాది చివ‌రి సూర్య‌గ్ర‌హ‌ణం ఎప్పుడంటే?

ఈ ఏడాది రెండో, చివ‌రి సూర్య‌గ్ర‌హ‌ణం సెప్టెంబ‌ర్ 21 రాత్రి 11 గంట‌ల‌కు ప్రారంభ‌మై సెప్టెంబర్ 22 ఉద‌యం 3.24 గంట‌ల‌కు ముగుస్తుంది. మొత్తం 4.24 గంటల పాటు కొనసాగనుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి స‌మ‌యంలో గ్ర‌హ‌ణం ప్రారంభంకానుండ‌డంతో క‌నిపించేందుకు అవ‌కాశం లేదు. అయితే భారత్‌లో కనిపించదు కాబట్టి సూతకం పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో కనిపించనుంది….

*డీఐజీలు వసూళ్లు చేస్తున్నారు :ys JAGAN (పులివెందుల ఎమ్మెల్యే).

రాష్ట్రంలో డీఐజీలు మాఫియా
డాన్లలా తయారయ్యారు. వారి పరిధిలో జరుగుతున్న అన్ని రకాల కుంభకోణాల్లో సొమ్ము వసూలు చేసే కలెక్షన్ ఏజంట్లలా మారారు.

ఈ డీఐజీలు వసూలు చేసిన దాంట్లో 50 శాతం స్థానిక ఎమ్మెల్యేలు, తన కింద అధికారులకిచ్చి.. మిగిలిన 50 శాతాన్ని పైకి పెదబాబు, చినబాబులకు పంపుతున్నారు.

రేవంత్ రెడ్డి జుట్టు మా చేతిలో ఉంది, కేంద్రం మా చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటే మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాం.. కేటీఆర్

నది ఏ బేసిన్ లో ప్రవహిస్తదో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాక, కింది ప్రాంతాలు మిగతా నీళ్లు తీసుకోవాలి

గోదావరి, కృష్ణా నదులు సింహభాగం మన తెలంగాణలో ప్రవహిస్తాయి.. ముందు మన అవసరాలు, మనం తాగడానికి నీళ్లు తీసుకోవాలి

మా నికర జలాల్లో, మిగులు జలాల్లో మా వాటాను కేంద్రం తేల్చకుండా, నీళ్లు మేము తీసుకుంటామని ఆంధ్రా నాయకులు అనడం ఎలా? అన్నారు..

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2016లో గచ్చిబౌలి పీఎస్లో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు రద్దు చేసింది. సంఘటన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది..

కేటీఆర్, కవితపై సీఐడీకి TCA ఫిర్యాదు

TG: మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఫిర్యాదు చేసింది. HCAలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపించింది. వీరితో పాటు జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్పైనా ఫిర్యాదు చేసింది.

జగన్మోహనరావు ఎన్నిక వెనుక వారి హస్తం ఉందని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచాక కేటీఆర్, కవిత, హరీశ్ రావుకు విజయాన్ని అంకితం చేశారని తెలిపింది..