హైదరాబాద్‌లో యూఎస్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్ …..
ప్రస్తుతం వాషింగ్టన్ DCలోని అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా ….
ప్రస్తుత కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ స్థానంలో ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్న లారా….
భారతదేశం.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయనున్న లారా విలియమ్స్….
నార్కోటిక్ ఆకస్మిక తనిఖీలు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక ప్రాంతమైన సారపాక సుందరయ్యనగర్, భాస్కర్ నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఉన్న పలు అనుమానాస్పద దుకాణాలలో, కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్ తో బూర్గంపాడు పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మాదక ద్రవ్యాలు అమ్మకాల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు బూర్గంపాడు పోలీసులు తెలియజేస్తున్నారు.
నిషేధిత గంజాయి మాదకద్రవ్యాలు అమ్మకాలు చేసిన కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఢిల్లీలో తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా కొందరు అడ్డుకున్నారు..cm రేవంత్ రెడ్డి.
ఢిల్లీలో తమకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు..దురదృష్టవశాత్తు రాష్ట్రపతి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు.. ఇది శోచనీయము.. ఇది బాధాకరము.. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటివరకు కుట్రలు చేస్తూనే వస్తోంది” అని అన్నారు..తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఇండి కూటమి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసనకు పూర్తి స్థాయి మద్దతు పలికారు..
*విజయవాడలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం*
విజయవాడ: ఏపీలో ఏసీబీ(ACB)కి భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్సీని పట్టుకున్నారు..
మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఇస్తున్నారంటూ పుకార్లు.. దారుణంగా కొట్టుకున్న మహిళలు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 జమ చేస్తున్నారంటూ పుకార్లు
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకొని పోస్టాఫీసు ముందు బారులు తీరిన మహిళలు
ఈ క్రమంలో తోపులాట చేసుకొని దారుణంగా కొట్టుకున్న మహిళలు..
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కనీసం ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు – కేటీఆర్.
ఇంకా గమ్మత్తు ఏంటేంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కేసీఆర్‌ను తిడుతుండు. రేవంత్ రెడ్డికి ఏదో సమస్య ఉన్నది. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఆయన ఉపన్యాసం ఉండదు. 20 నెలలుగా కేసీఆర్ తన పని తాను చేసుకుంటున్నాడు. ఢిల్లీ అయినా, అసెంబ్లీ అయినా, ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ పేరు కలువరిస్తుండు. నిద్రలో కూడా కలువరిస్తుండు అని నా డౌట్. రేవంత్‌కు ఎంత ఫోబియా పట్టుకుందంటే.. కేసీఆర్ అంటే ఎందుకింత భయం నీకు అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
420 అడ్డమైన హామీలిచ్చి అబద్దాలు చెప్పి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యావు. పని చేయ్.. ఆరు గ్యారెంటీలు అమలు చేయ్. ఎందుకీ డ్రామాలు. బీసీలను మోసం చేస్తున్నావు అంటే నన్ను కూడా తిడుతుండు. ఎవరిది డ్రామా.. రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా. మోదీతో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా. చంద్రబాబు చేస్తున్న జలదోపిడీ విషయంలో నీవు పైటింగ్ చేస్తున్నట్టు చేసుడు ఇంకా పెద్ద డ్రామా. నీ మేనిఫెస్టో కూడా ఒక పెద్ద డ్రామా. నీ డిక్లరేషన్లు దాని కంటే పెద్ద డ్రామా. అన్నింటికి మించి నీవు కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని నమ్మించడమే పెద్ద డ్రామా. ఈ మనిషిని ఎట్ట నమ్ముతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తడు. మోదీ స్కూల్లో చదివాను.. చంద్రబాబు కాలేజీకి పోయాను.. ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఎటన్న పోతా అని చెప్తున్నట్టే కదా.. ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత లేదు ఆయనకు. రేవంత్ డ్రామాలన్నీ ప్రజలందరికీ అర్థమవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీ వచ్చి చెప్పుకోలేనంత దినస్థితిలో ఉన్నారని అన్నారు…
పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకునేది లేదు
ఇరిగేషన్ శాఖపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ .
కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీ వాసులకు నోటీసులు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ
డ్యాం సేఫ్టీ నిబంధనల ప్రకారం డ్యాం కట్ట నుంచి 200 మీటర్ల పరిధిలో ఉన్నవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్న ఇరిగేషన్ శాఖ అధికారులు
విషయం తెలుసుకొని కాలనీ వాసులను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో, 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పుడు వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని తమ గోడు చెప్పుకున్న బాధితులు
పేద ప్రజలకు ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని, వారి ఇండ్లు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ తరపున ఉద్యమం చేస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్..
మహిళను కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తుండగా.. గచ్చిబౌలి ORR దగ్గర రోడ్డు ప్రమాదం..
హైదరాబాద్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు నుజ్జనుజ్ఞ అయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలైన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 5న సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
ఏపీ కేబినెట్ నిర్ణయాలు.
ఈనెల 9న మహిళలకు ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు ప్రకటన
రాఖీ సందర్భంగా మహిళలకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం
ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు
జిల్లాల పునర్విభజనలో లోపాలు..
సరిహద్దు సమస్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలి-సీఎం
జనగణన ప్రారంభమయ్యేలోపు ప్రక్రియ పూర్తి చేయాలి-సీఎం
లిక్కర్ కేసుపై మంత్రులకు CM చంద్రబాబు కీలక సూచన.
లిక్కర్ కేసు అరెస్ట్‌లపై మంత్రులెవరూ మాట్లాడొద్దు
దర్యాప్తు ఆధారంగానే అరెస్టులు ఉంటాయి-చంద్రబాబు…
,ఆ కేసులో జరిగిన అరెస్టులపై కానీ ఎవ్వరూ స్పందించకూడదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. అందువల్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అందరూ మౌనం పాటించాలన్నారు.
చైనాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు
ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటన
SCO సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోదీ
ట్రంప్ టారిఫ్‌లతో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత…
ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెలలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాను సందర్శిస్తారు. 2020లో భారత , చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణల తర్వాత ఆయన బీజింగ్‌కు తొలిసారిగా వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన కోసం చైనాకు వెళ్లే ముందు ప్రధాని మోదీ ఆగస్టు 30న జపాన్‌లో పర్యటిస్తారు. జూన్‌లో జరిగిన SCO మంత్రివర్గ సమావేశాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా హాజరయ్యారు. జైశంకర్ బీజింగ్‌లో జిన్‌పింగ్‌ను కలిశారు. భారతదేశం- చైనా సంబంధాలలో ఇటీవలి పరిణామాలను ఆయనకు వివరించారు. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో నిరంతర నాయకత్వ మార్గదర్శకత్వం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు..
పులివెందుల ZPTC గెలిస్తే ఎంత, ఓడితే ఎంత-పేర్నినాని
సజావుగా ఎన్నికలు జరపండి చూసుకుందాం
ఎందుకు ప్రచారంచేయకుండా అడ్డుకుంటున్నారు-పేర్నినాని
అధికారం ఉందని మీకు కన్నుమిన్ను కనిపించడం లేదు..
చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను..
మనం సినిమాల్లో మాత్రమే చూసుంటాం-.కార్లు ధ్వంసం చేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు
రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో ఆలోచించుకోండి..ఎన్నికల కమిషనర్ చూస్తూ ఊరుకుంటే..రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది..
విశాఖపట్నంలో ఘోర ప్రమాదం! ముగ్గురు మృతి,.
విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని హిమాలయ బార్ వద్ద వెల్డింగ్ షాప్‌లో ఆక్సిజన్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయిన కొద్దిసేపటికే సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు అంత శక్తివంతంగా ఉండటంతో షాపులో ఉన్న వ్యక్తులు తునాతునకలయ్యారు. ముగ్గురు వ్యక్తులు ఘటన స్థలంలోనే మృతిచెందగా, నలుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. వీరిలో కొందరిని కేజీహెచ్‌కి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు..పేలుడు ధాటికి షాపు పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిని గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ఈ దృశ్యాలు స్థానికులను భయానక పరిస్థితిలోకి నెట్టాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో స్క్రాప్ షాప్‌లో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..
భారీ వర్షాలు…. IMD హెచ్చరిక!.
హైదరాబాదులో కుండ పోత వర్షం.
హైదరాబాద్ నగరంలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నల్లని మబ్బులు కమ్ముకుని కుండపోత వర్షం కురిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మలక్‌పేట, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ముషీరాబాద్, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడుతున్నాయి. సాయంత్రం మేఘావృతమైన వాతావరణం చల్లబడి వర్షపు జల్లులు కురిసాయి. మరోవైపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో రోడ్లపై నీరు పొంగిపొర్లింది. వరదనీటితో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సాయంత్రం కురిసిన వర్షంతో పాఠశాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు, ఆఫీసుల నుంచి ఇంటికి పయనమైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. డ్రైనేజీ సిస్టమ్ బలహీనంగా ఉండే నగర ప్రాంతాల్లో తాత్కాలిక నీటి నిల్వలు ఏర్పడే ప్రమాదం ఉంది..భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD పేర్కొంది. పిడుగులు పడే పరిస్థితులు ఉన్నందున, ప్రజలు పాత చెట్ల కిందకు వెళ్లకూడదని, ఓపెన్ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ సూచించింది..
*🔹హైదరాబాద్ : నీట మునిగిన షేక్ పేట్ ఓయూ కాలనీ.*
*• ఇళ్లల్లోకి చేరిన వర్షపునీరు.*
జలదిగ్బంధంలో పలు అపార్ట్మెంట్లు.
చుట్టూ వరద ముంచెత్తడంతో నుంచి ఇళ్ల నుంచి బయటికి రాలేక స్థానికుల అవస్థలు.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.
అంధకారంలో ఓయూ కాలనీ లోతట్టు ప్రాంతాలు.
జిహెచ్ఎంసి సహాయక చర్యల కోసం స్థానికుల ఎదురుచూపు.
బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన.