లేటెస్ట్ న్యూస్ అప్డేట్..

Update News.

కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉండవల్లి.

కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉండవల్లి.. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్‌ చేయడం సరికాదు.. పవన్‌ కల్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం-ఉండవల్లి

గంజాయి నిర్మూలనపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రివ్యూ..

గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం.. మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా అటవీ ఉత్పత్తులపై గిరిజనులకు అవగాహన కల్పించాలని సూచన.. ఉద్యాన పంటలను ఉపాధి హామీతో అనుసంధానం చేయాలి.. ఎకో టూరిజం అభివృద్ధిపై ఫోకస్‌ పెట్టాలి-పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు.

రేపు ఉదయంలోపు అన్ని పనులు పూర్తిచేసి డ్రై రన్‌. 2 వేల మంది దేశ, విదేశీ అతిథులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే 4,800 మంది అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన ప్రభుత్వం..

Update News.

భారత్‌-రష్యా మధ్య కుదిరిన 11 కీలక ఒప్పందాలు..

2030 ఆర్థిక ప్రణాళికకు తుది రూపు ఇచ్చేలా విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం రంగాల్లో ఒప్పందాలు.. ఇరువైపులా మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా రెండు ఒప్పందాలు.. మరో ఐదేళ్లలో భారత్‌-రష్యా మధ్య వాణిజ్యం వంద బిలియన్‌ డాలర్లకు చేరేలా ఒప్పందాలు.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరిన్ని రంగాలకు విస్తరణ.. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అంటూ పిలుపునిచ్చిన పుతిన్‌.. అమెరికా నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా భారత్‌కు చమురు సరఫరా చేస్తాం-పుతిన్‌

ఢిల్లీ: సుప్రీంకోర్టుకు చేరిన ఇండిగో సంక్షోభం..

వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దు కావడంపై పిల్.. ప్రయాణికుల అసౌకర్యంపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు.. కేంద్రం కొత్త నిబంధనలను ఇండిగో పాటించకపోవడం వల్లే ఇబ్బందులంటూ పిల్.. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రయాణికుల హక్కుల ఉల్లంఘన జరిగిందని పిల్

విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్‌..

సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని హెచ్చరిక.. అడ్డగోలుగా రేట్లు పెంచితే ఊరుకోబోమని వార్నింగ్‌.. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశం.. ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను దోచుకోవడంపై ఆగ్రహం

ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ సమిట్’ – హైదరాబాద్ నలుమూలలా ‘3D’ ముస్తాబు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట ని పురస్కరించుకుని హైదరాబాద్ సంప్రదాయ, సాంకేతిక హంగులతో ముస్తాబవుతోంది. చార్మినార్, సచివాలయం వద్ద త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, హుస్సేన్ సాగర్లో వాటర్ థీమ్ ఏర్పాటు కానున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు భారీ ఎల్ఈడీ తెరలు పెట్టనున్నారు. హైదరాబాద్ నలుమూలలా సమిట్ లోగోలతో 1,500 జెండాలు రెపరెపలాడనున్నాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్‌ను అందంగా ముస్తాబు చేస్తోంది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ హంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణల మేళవింపులతో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమిట్‌ వేదిక ఇలా అన్నిచోట్లా హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్టులతో ప్రత్యేకంగా పెట్టుబడుల పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి, నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సచివాలయం వద్ద త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్‌ప్లేలు ఏర్పాటు చేయనున్నారు..
వేడుక వైభవాన్ని కళ్లకు కట్టేలా : దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌తో ప్రదర్శించనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత–రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్క్రీన్లపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి? ఎంత దూరం? వంటి వివరాలు పొందుపరుస్తున్నారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమిట్ లోగోతో తయారు చేయించిన 1,500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని కళ్లకు కట్టనున్నారు. హైదరాబాద్‌లో 10 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సమిట్‌కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు.