BRS నేతల మాటలు నమ్మి గవర్నర్ BC రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపించారని CM రేవంత్ అన్నారు. BRS తెరవెనక లాబీయింగ్ చేసి రాష్ట్రపతికి పంపేలా చేసిందని ఆరోపించారు. ‘సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా మాట్లాడుతున్నారు. BRSకు ప్రజలు ఇప్పటికే శిక్ష విధించారు. అయినా మారకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. మమ్మల్ని అభినందించి ఉంటే KCR పెద్దరికం పెరిగి ఉండేది’ అని వ్యాఖ్యానించారు…
తెలంగాణ అసెంబ్లీలో మూడు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు, మున్సిపల్ చట్టసవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. తొలుత మున్సిపల్, ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చించారు…
బిల్లుపై బీసీలకున్న అనుమానాలను నివృత్తి చేయాలి.. బిజెపి
బిల్లుపై బీసీలకున్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ‘42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ చర్చించాలి. మీ చేతిలోని అధికారాన్ని పంచిపెట్టడానికి మీకేంటి ఇబ్బంది? మంత్రివర్గంలో BCల సంఖ్య ఎంత? బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ.20 వేలకోట్లు చొప్పున ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 పైసలు రాలేదు’ అని వ్యాఖ్యానించారు…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) సమావేశాల్లో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చజరిగింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదిలాఉంటే.. సభ ప్రారంభమైన వెంటనే మున్సిపల్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు…తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. చర్చ జరుగుతున్నందుకు ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ చట్టం తెచ్చినట్లు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు. దీనికోసమే ఈ బిల్లు తెచ్చినట్లు తెలిపారు. అయితే, చర్చ అనంతరం మున్సిపల్ చట్టసవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది.
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం..!
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లు తెచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు బీఆర్ఎస్ తరపున స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే, బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని అన్నారు. బలహీన వర్గాల గురించి ఇప్పుడే మాట్లాడటం లేదు.. గతంలో కూడా బీసీల కోసం కేసీఆర్ గట్టిగా మాట్లాడారని అన్నారు. కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ పెట్టాలని ప్రధాని దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ గా బీసీలను చేశాం. బీసీ బిల్లులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి.. బీసీలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్ బిల్లును తెచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతుంది. గతంలో బీసీ బిల్లుకు బీఆర్ఎస్ చిత్తశుద్దితో కృషి చేసిందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఐదు మంది బీసీలను రాజ్యసభకు పంపించిందని చెప్పారు.
చర్చ అనంతరం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభలో అల్లోపతిక్ మెడికల్ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు..
అల్లు అర్జున్ ని పరామర్శించిన పవన్ కళ్యాణ్.!
నిన్న అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవికి అత్తమ్మ కావడంతో అల్లు, మెగా కుటుంబాలు రెండూ విషాదంలో మునిగాయి. నిన్న అంతా చిరంజీవి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండి అన్ని చూసుకున్నారు. నిన్నే సినీ పరిశ్రమ ప్రముఖులు అంతా వచ్చి ఆమెకు నివాళులు అర్పించి అల్లు అరవింద్, బన్నీ, చరణ్ లను ఓదార్చారు.(Pawan Kalyan)..
అయితే నిన్న పవన్ కళ్యాణ్ కి వైజాగ్ లో జనసేన బహిరంగ సభ ఉండటంతో అది అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ ని, అల్లు అరవింద్ ని పరామర్శించారు. అల్లు కనకరత్నమ్మ ఫొటోకు నివాళులు అర్పించారు పవన్. దీంతో పవన్ కళ్యాణ్ బన్నీ తో మాట్లాడిన ఫొటోలు నేడు వైరల్ గా మారాయి..
ట్రంప్ సుంకాల వేళ- భారత్-చైనా సంబంధాలు బలోపేతం!.
పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. సరిహద్దు నిర్వహణపై కూడా భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం ఉందని మోదీ స్పష్టం చేశారు. గతేడాది కజాన్‌లో జరిగిన చర్చల తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది అని పేర్కొన్నారు. గల్వాన్ ఘర్షణల తరువాత భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి ఇరువురు నేతలు విస్తృత చర్చలు జరిపిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తరువాత షాంఘై సహకారం సంస్థ (ఎస్సీఓ)కు చైనా విజయవంతంగా అధ్యక్షత వహించినందుకు జిన్‌పింగ్‌కు అభినందనలు తెలిపారు..రెండు దేశాల సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొంది. ఇటీవలే కైలాశ్ మానసరవోర్ యాత్ర కూడా పునఃప్రారంభమైంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా నడుస్తున్నాయి. భారత్-చైనా సత్సంబంధాలు 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.”
– ప్రధాని మోదీ..
సుమారు ఏడేళ్ల తర్వాత తొలిసారి మోదీ, జిన్‌పింగ్‌లు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా హాజరయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఇరువురు నేతలు సరిహద్దు సమస్యలు, ఆర్థిక పరమైన సవాళ్లు, అమెరికా సుంకాల వేళ ఎదురవుతున్న పరిస్థితులు వంటి అంశాలపై సమాలోచనలు సాగించినట్లు తెలుస్తోంది. గల్వన్ ఘర్షణల సమయంలో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా ఇన్నేళ్లు భారత్ -చైనా దేశాధినేతలు ఎలాంటి చర్చల్లో పాల్గొనలేదు. గతేడాది బ్రిక్స్ సదస్సులో భాగంగా మోదీ-జిన్ పింగ్‌లు రష్యాలోని కజన్‌లో ఒకే వేదికపై కనిపించారు..
వాస్తవానికి ఆదివారం ప్రారంభమయ్యే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ చైనాకు వెళ్లారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసింది. అంతేకాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయనే నెపతంలో భారత్, చైనాలను లక్ష్యం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తియాంజిన్ పర్యటనకు ముందు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్, చైనాలు కలిసి పనిచేయడం ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతకు ముందు భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలు విధించడానికి చైనా తప్పుపట్టింది. ఈ విషయంలో భారత్‌కు తన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తరువాత చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారతదేశాన్ని సందర్శించారు. ఇది జరిగిన పక్షం రోజుల్లోనే మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. అంటే ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం, భారత్, చైనాలను వాణిజ్యపరంగా దగ్గర చేసినట్లు అయ్యిందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్‌లో తప్పకుండా వస్తుందది.. హరీష్ రావు.
రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్‌లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు..సీఎం వద్దనే మున్సిపాలిటీ శాఖ ఉంది. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయింది. మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత మేరకు అభివృద్ధి చేశాం అన్నది ముఖ్యం. నిధులు ఇస్తున్నారా లేదా..? అనేది ఆలోచించాలి. ఫాగింగ్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో నెల నెల పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చాక నిధులు ఇవ్వలేదు. ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్‌రావు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తుంది.. రక్తమాంసాలు పీలుస్తుంది.. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం.. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఇవాళ్నేమో బరాబర్ పైసలు కట్టాలని వసూలు చేస్తున్నారు. మరి అదే ప్రజలు నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది. ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం.. ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత మేర ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని జీవోలో చెప్పాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన ఎల్ఆర్ఎస్ డబ్బులను మున్సిపాలిటీలకు ఎప్పటి వరకు అందజేస్తారో చెప్పాలి. వచ్చిన డబ్బు ఎంతనో చెప్పాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
పట్టణ ప్రగతి కింద నిధులు ఇవ్వలేదు.. ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్ర నుంచి నయా పైసా లేదు. మరి ఎలా కొనసాగాలి మున్సిపాలిటీలు. ప్రజలు కట్టిన డబ్బును ఎప్పటిలోగా చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బులను కూడా ఇవ్వడం లేదు. మరి మున్సిపాలిటీలు ఎలా నడవాలి..? పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు. కొత్త మున్సిపాలిటీలకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేయండి. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్‌కు ఎస్డీఎఫ్ కింద రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఆ డబ్బులన్నీ మీరు రద్దు చేశారు. ఇదేం పద్ధతి అని హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.