లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం..

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది

వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది..

త్వరలోనే వన్‌ నేషన్‌ – వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం..

దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది..

ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని దాని పై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని మోడీ తెలిపారు..

ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్న చిరు వ్యాపారి

వరంగల్‌లోని మట్టేవాడ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి చిరు వ్యాపారి హల్చల్..

ఆటోనగర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న చిరు వ్యాపారి శ్రీధర్‌ను గత నెల రోజుల నుండి ఎస్ఐ విఠల్ వేధిస్తున్నాడంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యయత్నం..

పెట్రోల్ బాటిల్ లాక్కున్న పోలీస్ సిబ్బంది.. ప్రధమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.

తాను చనిపోతే దానికి కారణం ఎస్ఐ అంటూ వీడియోలో చెప్పిన శ్రీధర్…

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.

కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.

టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా, ఈ-మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు.

దీనిపై రవాణా మంత్రి రామలింగా రెడ్డితో చర్చిస్తాను అని శివకుమార్ వివరించారు…

ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి.. ప్రయాణికులను దోచుకుంటున్న ఆర్టీసి..

12 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.20 ఛార్జ్ ఉంటే ఇప్పుడు రూ.30 చేసిన ఆర్టీసి..

ఎందుకు పెంచారు అని అడిగితే టోల్ పెట్టారు అందుకు పెంచారు అని సమాధానం ఇస్తున్న కండక్టర్.

బస్సు టికెట్లో టోల్ మెన్షన్ చేయకుండా టికెట్ ఇచ్చి ఎందుకు టికెట్ రేటు పెరిగిందంటే.. నోటి మాటగా టోల్ చార్జీ అని చెబుతున్న ఆర్టీసి సిబ్బంది.

టికెట్ అడిగింది కోదాడకు 12 km దూరంలో ఉన్న చెరువుమదారం క్రాస్ రోడ్ స్టేజీ వరకు, కానీ బస్సు కండక్టర్ టికెట్ ఇచ్చింది కోదాడకు 18 km దూరంలో ఉన్న నేలకొండపల్లి వరకు.

బస్ స్టాప్ ఉన్నప్పటికీ అడిగిన స్టేజికి కన్నా రెండు స్టేజీలు ఎక్కువ టికెట్ కొట్టి దానికి టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ప్రయాణికుడు…

ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తూ.. కిందపడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కరీంనగర్ – ఇంధిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ పూలమాల వేసే క్రమంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో ఒకసారిగా కిందపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం…

*25 లక్షల దీపాలతో అయోధ్య ధగధగ..!!*

*2 గిన్నిస్‌ రికార్డుల సాధన..

*దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలోని సరయూ నదీతీరంలో దీపోత్సవ కాంతులు..

అయోధ్య: బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి.

గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీతీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈసారి కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసింది. బాలరాముణ్ని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వయంగా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మొత్తం 55 ఘాట్లలో భక్తులు 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. అయోధ్యా నగరం ధగధగ మెరిసిపోయింది.

యూపీ టూరిజం విభాగం ఆధ్వర్యంలో భక్తులు ఏకకాలంలో 25,12,585 దీపాలను వెలిగించారు. ఇది ఇంతకు ముందున్న గిన్నిస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది. అదేవిధంగా 1,121 మంది వేదాచార్యులు ఏకకాలంలో హారతి ప్రదర్శించి మరో గిన్నిస్‌ రికార్డును సృష్టించారు. కార్యక్రమానికి హాజరైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత ప్రవీణ్‌ పటేల్‌ రికార్డులను ప్రకటించారు.

అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. దీపోత్సవానికి ముందు ‘పుష్పక విమానం’ తరహాలో రామాయణ వేషధారులు హెలికాప్టరు నుంచి దిగారు. వీరంతా కొలువుదీరిన రథాన్ని సీఎం యోగి, మంత్రులు లాగారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్‌ షో, డ్రోన్‌ షో, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. నగరమంతా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా, కాంబోడియా, ఇండోనేసియా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి…

ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, జనసేన శ్రేణులు

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పైడిచింతపాడులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఘర్షణలో పలువురికి గాయలవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…

సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ …

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాన్లతో పండుగ సంబరాలు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన మోదీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని ఏటా సైనికులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే..

ఘనంగా ప్రారంభమైన దీపావళి సంబరాలు, నరకాసుర దహనం …

తెలంగాణ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో దీపావళి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనగరంలోని సమతామూర్తి ప్రాంగణంలో గురువారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30 అడుగుల భారీ నరకాసుర ప్రతిమను ఏర్పాటుచేసి.. దానిని దహనం చేశారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. నరకాసురుడు దుష్ట గుణాలకు ప్రతీక అని, ప్రజలంతా దుర్గుణాలను వదిలి సత్ బుద్ధి కలగాలనే నరకాసుర వధ చేస్తామని తెలిపారు…

ఆటో రంగంలో కొత్త ఆవిష్కరణలు..

నీటితో నడిచే స్కూటర్‌ ప్రదర్శన..

ఆటో రంగంలో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకుంటున్నాయి. పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తర్వాత, ఇప్పుడు నీటితో నడిచే స్కూటర్ల వంతు వచ్చింది. ఈ సంవత్సరం, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో జాయ్ ఈ-బైక్ దాని నీటితో నడిచే స్కూటర్‌ను ప్రదర్శించింది. ఇది చాలా చర్చనీయాంశమైంది. ఈ స్కూటర్ ఉత్పత్తికి సంబంధించి జాయ్ ఇ-బైక్ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మీడియా నివేదికల ప్రకారం ఈ స్కూటర్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మరోసారి పరిచయం చేయవచ్చు…నివేదికల ప్రకారం జాయ్ ఈ బైక్ మాతృ సంస్థ వార్డ్‌విజార్డ్ నిరంతరం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఈ టెక్నాలజీ కింద ఈ స్కూటర్ నీటిపై నడుస్తుంది. భారతదేశంలో హైడ్రోజన్ సాంకేతికత విజయవంతమైతే, క్లీన్ మొబిలిటీలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే దీని రాక కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ స్కూటర్ డిస్టిల్డ్ వాటర్‌తో నడుస్తుంది. స్కూటర్ సాంకేతికత నీటి అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. దాని నుండి హైడ్రోజన్ అణువులను వేరు చేస్తుంది. హైడ్రోజన్ వేరు చేసినప్పుడు స్కూటర్‌ను నడపడానికి హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగిస్తారు..

200 ఏళ్లుగా దీపావళి పండుగకు దూరం..!

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెం 200 ఏళ్లుగా దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. అప్పట్లో పండుగ రోజే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. అదే రోజు రెండు ఎద్దులు కూడా మృత్యువాతపడ్డాయి. దీంతో గ్రామస్థులంతా తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో తమ ఊర్లో దీపావళి జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి దీపావళికి ఆ గ్రామంలో దీపాలు కూడా వెలిగించరు.