లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

CM Chandrababu: మహిళలకు నెలకు రూ.1500.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

అమరావతి: చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయింపులు చేసింది. అందులోభాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. అందుకోసం ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3341.82 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది..

మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయించారు. ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, ఎస్టీ మహిళలకు రూ. 330.10 కోట్లు, బీసీ మహిళలకు రూ. 1099. 78 కోట్లు, మైనార్టీలకు రూ. 83.79 కోట్లు, ఆర్థికంగా వెనుక బడిన వారికి రూ. 629. 37 కోట్ల నిధులను కేటాయించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వరుసగా అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తుంది. ఇటీవల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసింది.

అలాగే ఈ ఏడాది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సైతం ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు గత జగన్ ప్రభుత్వ హయాంలో.. పలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు కోట్లాది రూపాయిలు ఇచ్చింది. అదీ కూడా అప్పు చేసి మరి ఇలా ప్రభుత్వం ఇవ్వడంతో.. ఖజానా ఖాళీ కావడం దేవుడెరుగు. ఈ పథకాల కోసం తెచ్చిన నగదుకు వడ్డీలకు వడ్డీలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం వద్ద పైసా నగదు లేన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలాంటి వేళ.. చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఆ క్రమంలో ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది. మరోవైపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ నవంబర్ మాసాంతంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో కొత్త బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అందులోభాగంగా సూపర్ సిక్స్ పథకాలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సైతం భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా..

అమరావతి: ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు..

రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్షను జనవరి 5న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు అక్టోబర్‌ 30న ఏపీపీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీని రీషెడ్యూల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది..

అర్థరాత్రి అరెస్ట్‌లు, అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ దగ్గర ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. అంబటి రాంబాబు.

అంబటి రాంబాబు మాట్లడుతూ..
అర్థరాత్రి అరెస్ట్‌లు, అర్థరాత్రి మెజిస్ట్రేట్‌ దగ్గర ప్రొడ్యూస్‌ చేస్తున్నారు పోలీసులు.
నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి, హెరాష్‌ చేస్తున్నారు.
పోలీసులే అరబ్‌ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారు..ఈనాడు భాషను పోలీసులు మాట్లాడుతున్నారు..ఐపీఎస్‌ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి..పులి మీద స్వారీ చేస్తున్న చంద్రబాబు ను రేపు ఆ పులే తింటుంది.-…

తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్‌ చేసిన వారిని బూటుకాలితో తంతూ బూతులు తిట్టాడు.పేర్ని నాని వైయస్ఆర్‌సీపీ..

తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అరెస్ట్‌ చేసిన వారిని బూటుకాలితో తంతూ బూతులు తిట్టాడు.

కులం పేరుతో మాజీ ముఖ్యమంత్రిని సైతం దూషించాడు.

మరో పోలీస్‌ అధికారి అరబ్‌ దేశాల శిక్షలు అమలు చేయాలని చెబుతున్నారు.

చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన అధికారులకు ఉరివేసే చట్టాలు కూడా చాలా దేశాల్లో ఉన్నాయి. అవి తెలుసుకోవాలి..

శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థుల ధర్నా..!

నాగర్ కర్నూల్ – వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని.. హాస్టల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు.

కలెక్టర్ రావాలంటూ, హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు…

రేవంత్ రెడ్డి ప్రతినిధిని కొట్టారు అంటే రేవంత్ రెడ్డిని కొట్టినట్లు..జగదీష్ రెడ్డి..

రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి ఉంటే వీపు ఇంకా ఎక్కువ చింతపండు చేస్తుండే..

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచి పోవడానికి వచ్చాడు.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ మాత్రం ప్రేమ లేదని కాంగ్రెస్ కార్యకర్తలే నాతో అంటున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త బాధపడుతున్నాడు అన్నారు..

నెదర్లాండ్ రాయబారి మరిసా జెరార్డ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నెదర్లాండ్స్ దేశ రాయబారి మరిసా జెరార్డ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల పట్ల నెదర్లాండ్స్ రాయబారి ఆసక్తి కనబర్చారు అంటు తెలిపినా సిఎం రేవంత్ రెడ్డి వర్గీయులు…

తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్గ్యూమెంట్స్ పూర్తి కావడంతో 2024, నవంబర్ 12వ తేదీన తీర్పును హోల్డ్‎లో పెట్టింది…దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసలేం జరిగిందంటే..?

గతేడాది నవంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‎కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‎లో సవాల్ చేశారు. స్పీకర్‎కు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు లేదని ఆయన పిటిషన్‎లో పేర్కొన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం (నవంబర్ 12) ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‎పై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని స్టేట్ పాలిటిక్స్‎లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది..

నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి..కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్.

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ఐటీ క్యాంపస్లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే..సోమవారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని స్వాతిప్రియ ప్రాణాలు కోల్పోయింది. స్వాతిప్రియ స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలిక పరిధిలోని పెర్కిట్ గ్రామం. ఉజ్వల-రవీందర్ దంపతులకు స్వాతిప్రియ(18) రెండో సంతానం. సోమవారం ఉదయం తోటి స్నేహితులు టిఫిన్ చేయడానికి పిలవగా ఆమె రానని చెప్పింది. ఆ తర్వాత అర గంటకు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. గమనించిన తోటి విద్యార్థులు ఆర్జీయూకేటీ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

అయితే స్వాతిప్రియ గదిలో సూసైడ్ లెటర్ దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆ లెటర్లోని కొన్ని పేజీలు బయటకు వచ్చాయి. మెుత్తం 6 పేజీల సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కానీ అందులోని కొన్ని పేజీలను బయటకు లీక్ చేసినట్లు తెలిసింది. సూసైడ్ లెటర్లో తన కుటుంబం, విద్యార్థులు, కాలేజీ గురించి స్వాతిప్రియ ప్రస్తావించినట్లు వెల్లడైంది. సూసైడ్ లెటర్లో స్వాతిప్రియ ప్రస్తావించిన అంశాలు కన్నీరు పెట్టించే విధంగా ఉన్నాయి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉందని.. అయినా తాను ఇక బతకలేనని చెప్పింది. తన అంత్యక్రియలకు స్నేహితులందరూ రావాలని కోరింది.

‘అమ్మా.. నాన్న.. నన్ను క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. సూసైడ్ చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది. ధైర్యం సరిపోవటం లేదు. అయినా తప్పట్లేదు.. ఐ మిస్ యూ సో మచ్. అక్క, తమ్ముడిని బాగా చూసుకోండి. అక్క, తమ్ముడు.. మీకేం కష్టం వచ్చినా డాడీకి చెప్పండి. నాన్న మీరు ఇకనైనా స్మోకింగ్ చేయటం మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి. మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియల్లో పాల్గొనాలి.’ అంటూ స్వాతి ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది.

ఇదిలా ఉండగా.. బాసర క్యాంపస్లో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. విద్యార్థిని స్వాతిప్రియ మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని.. హత్య చేసి సూసైడ్గా చిత్రీకరించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్లో మృతదేహాన్ని చూపించకుండానే మార్చురీకి తరలించటంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ యాజమాన్యం తీరు సరిగ్గా లేదని.. సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నట్లు స్వాతిప్రియ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కాలేజీ క్యాంపస్ను సందర్శించి వివరాలు సేకరించారు. బాసర క్యాంపస్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు…

కలెక్టర్‌పై దాడిలొ 300మంది అరెస్ట్..!

కలెక్టర్‌పై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 300 మందిని పరిగి పీఎస్‌కు తరలించారు..దాడిలో పలువురు అధికారులకు గాయాలు అయ్యాయి. ఫార్మాకంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణపై లగచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. దీనిపై.. బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శలను కాంగ్రెస్ తప్పుపడుతోంది. లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. అర్థరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ఐతే దాడిపై స్పందించిన కలెక్టర్.. అల్లరిమూకలే దాడిచేశాయనీ.. వారిపై చర్యలుంటాని చెప్పడం విశేషం.

వికారాబాద్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద అధికారుల నిరసన చేపట్టారు. లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై గ్రామస్థులు దాడిని ఖండిస్తూ అధికారులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ కార్యాలయానికి తాళం వేసి నిరసన చేశారు. ఏకంగా కలెక్టర్‌పై దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేపటి నుంచి పెన్‌ డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని..అంత వరకు తమ నిరసన కొనసాగిస్తామన్నారు..

ఫార్మా కంపెనీ కోసం ప్రాణాలు పోయినా మా పొలాలను ఇవ్వము..

కలెక్టర్, తహసీల్దార్, ప్రభుత్వ అధికారులపై చేసిన దాడిని వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు సమర్ధించుకుంటున్నారు. నిజంగా వాళ్లు ప్రభుత్వ అధికారులని తమకు తెలియదని, ఎవరో అనుకుని దాడి చేసినట్లు చెబుతున్నారు…అయితే ఫార్మా కంపెనీ కోసం ప్రాణాలు పోయినా మా పొలాలను వదులుకోమంటున్నారు..

కలెక్టర్ అని మాకు తెలియదు..

ఈ మేరకు మంగళవారం ఒక టీవీ చానల్ తో మాట్లాడిన లగచర్ల గ్రామస్థులు.. జిల్లా కలెక్టర్ అని మాకు తెలియదు. అధికారులను కొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. మమ్మల్ని గ్రామంలో నుంచి బయటకు వెళ్లనీయలేదు. గ్రామం చుట్టూ పోలీసులు పహారా కాశారు. ప్రాణంగా చూసుకుంటున్న భూమిని కోల్పోతాం.ఫార్మసిటిలో ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనేందుకు వెళ్లాలన్నారు. కానీ మేము ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా.. గ్రామంలోనే వంటావార్పు చేసుకుని ఉందామనుకున్నామని చెప్పారు..

ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి..

అయితే ఈ క్రమంలోనే ఒక్కసారిగా అధికారుల వాహనాలు గ్రామంలోకి రావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లామని గ్రామస్థులు తెలిపారు. ఇక వ్యవసాయాన్ని జీవనాధారంగా నమ్ముకుని బతుకుతున్న భూమిని ఎలా వదులుకుంటామని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. కానీ రోడ్డున పడుతామనుకోలేదంటూ ఆవేదన చెందుతున్నారు…