లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టు చేసిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ..

అక్రమ అరెస్టు పైన ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని కోరిన కేటీఆర్..

ప్రభుత్వ అప్రాజస్వామిక నియంత విధానాలపైన పార్టీ న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపిన కేటీఆర్..

నరేందర్ రెడ్డి సతీమణి శృతితో మాట్లాడిన కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా..

పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టు పైన కోర్టులో పోరాటం చేస్తుందని హామీ…

కేటీఆర్ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైల్లో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టు కాగా.. మహబూబ్ నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్ లో.. సీఎం మహారాష్ట్రలో ఉన్నారు. మంత్రి లండన్ లో బిజీబిజీగా ఉన్నారు.. జైల్లో రైతులు ఉన్నారు. అంటూ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. జూపల్లి, కాంగ్రెస్ నేతల వీడియోను కేటీఆర్ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అక్రమ అరెస్టుపైన ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే నరేందర్ రెడ్డి సతీమణి శృతితో కూడా కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెల్ నరేందర్ రెడ్డి అరెస్టుపైన కోర్టులో పోరాటం చేస్తుందని హామీ కేటీఆర్ ఇచ్చారు..

మహారాష్ట్రల్లో తెలంగాణ ప్రజల ప్రచారం..!

కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెలంగాణ ప్రజలు

మహారాష్ట్ర – కిన్వట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖరా కె గ్రామస్తులు ఎన్నికల ప్రచారం చేశారు.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను నమ్మి మేము మోసపోయాం.. రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వచ్చి తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని అబద్ధాలు చెపుతున్నాడు.

మహారాష్ట్ర ప్రజలు కూడా ఐదు గ్యారెంటీలని నమ్మి ఓటు వేసి మోసపోకండని ముఖరాకె గ్రామస్తులు ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ప్రచారం చేశారు.

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

పంచాయతీరాజ్‌, పురపాలక చట్ట సవరణ బిల్లులను..
సభలో ప్రవేశపెట్టిన మంత్రి నారాయణ..

ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్దీకరణ బిల్లును..
సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌..

బడ్జెట్‌పై చర్చకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అనుమతి
చర్చ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌..

బాగ్ అంబర్‌పేట్‌లో హైడ్రా కమీషనర్ పర్యటన..

హైదరాబాద్ – బాగ్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట చెరువును పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాథ్..

బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వచ్చేలా హైడ్రా ప్లాన్.

భయంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల మోహరింపు.

బతుకమ్మ కుంట కబ్జాకు గురైందని వీహెచ్ ఫిర్యాదు…

నవ గ్రహాల విగ్రహాల ధ్వంసాన్ని ఖండించిన అఘోర ..!

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్‌ పోర్ట్ కాలనీ నవగ్రహాల విగ్రహాల ఖండించిన అఘోర ..
ఎయిర్ పోర్ట్ హనుమాన్ దేవాలయం వద్ద నవ గ్రహాల విగ్రహాల ధ్వంసాన్ని ఆమె సందర్శించారు ..
గుడిలపై మహిళలపై హత్యలు చేస్తే అం**గాలను తీసేస్తానని హెచ్చరించింది ..
ఆడవాళ్ళపై గుడిలపై దాడులు చేస్తుంటే పట్టించుకోని అధికారులు తనని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు ..ఎక్కడికైనా వెళ్తా గోహత్యలపై మహిళలపై దాడులను ఎదిరిస్తా ఎవరు ఏం చేస్తారో చూస్తా ..
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ ఆలయం నుండి జూకల్ గ్రామానికి బయలుదేరిన అఘోర…

*కలెక్టర్ ఫై దాడి*

బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు కొడంగల్ BRS మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడ్డారని అరెస్టు చేశారు.

హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన పోలీసులు

పోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం పై *బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు.

• మర్రి జనార్దన్ రెడ్డి,
• గువ్వల బాలరాజు,
• ఫైళ్ల శేఖర్ రెడ్డి,
• బొల్లం మల్లయ్య యాదవ్ లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు.

కేసులో ప్రమేయం పై నలుగురు మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్న పోలీసులు

SIB మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నతో పలుమార్లు సంభాషించినట్లు గుర్తించిన పోలీసులు

ఈ నెల 11న హాజరు కావాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు ఈనెల 8 న నోటీసులు జారీ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

అనారోగ్య కారణంతో తో రేపు హాజరవుతానన్న చిరుమర్తి లింగయ్య..

COP29: ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడు?.

నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు ,కాప్‌-29లో గుటెరస్‌ హెచ్చరిక
బాకూ…

భూతాపాన్ని తగ్గించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ పార్టీస్‌-కాప్‌) – 29 సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగించారు. దాదాపు 200 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాబోయే రెండు రోజుల్లో 75 దేశాలకు పైగా అధినేతలు హాజరు కావచ్చని భావిస్తున్నారు. అయితే కాలుష్యాన్ని పెద్దయెత్తున విడిచిపెడుతున్న అమెరికా వంటి సంపన్న దేశాల నేతలు కొందరు ముఖం చాటేసే అవకాశముందని నిర్వాహకులు చెబుతున్నారు. రెండవ రోజు మంగళవారం జరిగిన సదస్సులో ఐరాస చీఫ్‌ గుటెరస్‌ ప్రసంగిస్తూ సమయం మించిపోతోందని, తక్షణమే భూతాప నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? తక్షణ కార్యాచరణకు నడుం బిగించకపోతే మానవాళి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ఆయన హెచ్చరించారు. వాతావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అధ్వానంగా మారుతున్న దశలో సత్వర కార్యాచరణకు నడుం బిగించాలని కోరారు. భూ మండల ఉష్ణోగ్రతలు మరింత వినాశకరమైన రీతిలో పెరగకుండా అడ్డుకునేందుకు సమయం మించి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ నిధి విషయంలో ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలి, లేని పక్షంలో మానవాళి విపత్కర పరిస్థితులు ఎదుర్కొవాల్సివస్తుందని హెచ్చరించారు.
ఇటువంటి ఆందోళనకర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న వాతావరణ సదస్సుకు అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ వంటి ప్రముఖ నాయకులు గైర్హాజరవ్వడం పట్ల వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి గైర్జారు వల్ల సత్వర కార్యాచరణ విషయంలో ఐక్యతపై అనిశ్చిత నెలకొందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపొందడం ఈ దఫా వాతావరణ చర్చలను తీవ్రంగా ప్రభావితం చేసిందని వారు విశ్లేషించారు. ఇప్పటికైనా సంఘీభావంతో వ్యవహరించాలని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ సిమన్‌ స్టీల్‌ ప్రపంచ అగ్ర నేతలకు విజ్ఞప్తి చేశారు.

గ్లోబల్‌ కార్బన్‌ మార్కెట్‌కు గ్రీన్‌ సిగ్నల్
బాకూ : సదస్సు ప్రారంభం అట్టహాసంగా జరిగినప్పటికీ అధికార ఎజెండా మాత్రం గంటల తరబడి ఆలస్యమైంది. అనంతరం సోమవారం సాయంత్రం అంతర్జాతీయ కార్బన్‌ మార్కెట్‌కుకొత్త యుఎన్‌ ప్రమాణాలను ప్రభుత్వాలు ఆమోదించాయి. అంతర్జాతీయ కార్బన్‌ మార్కెట్‌ను ఖరారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం ఎనాుళ్ళగానో ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సదస్సులో దేశాలు దానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ కార్బన్‌ మార్కెట్‌ ఏర్పాటు, దేశాలు తమ వాతావరణ లక్ష్యాలను ఎదుర్కొనే దిశగా ట్రేడ్‌ కార్బన్‌ క్రెడిట్‌ – అంటే కర్బన ఉద్గారాలకు సంబంధించి ధృవీకరించిన తగ్గింపు – లను ఇవ్వడానికి కీలకమైన చర్యగా పరిగణిస్తునాురు. పారిస్‌ ఒప్పందంలో అర్టికల్‌ 6గా పిలిచే సెక్షన్‌ ద్వారా ఈ మార్కెట్‌ రూపొందింది. దేశాలు కర్బన ఉద్గారాలను తమలో తాము ఎలా ట్రేడ్‌ చేసుకోగలవో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.
పారదర్శకత, సమగ్రతపై మరింతగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా మరింత పరిపక్వతతో కూడిన కార్బన్‌ మార్కెట్‌ను అందించడమే కాకుండా తన వాతావరణ నిధుల ఆకాంక్షలను మరింత ఉత్తేజితపరిచేందుకు భారత్‌కు ఒక అవకాశం దొరికింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, టర్కీలతో సహా జి-20 దేశాల్లో పలు దేశాలు వాతావరణ కార్యాచరణను గణనీయంగా పెంచాల్సిన అవసరం వుందనిక్లైమేట్‌ అకౌంటబిలిటీ మాట్రిక్స్‌ పేర్కొంది. ఈ సదస్సులో దీనిు ప్రారంభించారు. వాతావరణ అంశాల్లో దేశాల పనితీరును విశ్లేషించేందుకు ప్రపంచ వర్ధమాన దేశాల నుండి వచ్చిన తొలి అంచనా సాధనమే ఈ సిఎఎం.
ఇదిలావుండగా, శిలాజ ఇంధనాలను, వాటిని ఉపయోగించుకునేందుకు దేశాలకు గల హక్కును ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న అజర్‌బైజాన్‌ సమర్ధించింది. అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలియెవ్‌ మాట్లాడుతూ, శిలాజ ఇంధనాలను వాడుతునుందుకు అజర్‌బైజాన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని, ప్రకృతి వనరులను వాడుకునే ఏ దేశం పట్ల ఇలా ఒక అభిప్రాయానికి రాకూడదని అన్నారు. ఇది దేవుడిచ్చిన బహుమతి అని ఆయన వ్యాఖ్యానించారు…

*ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్‌ ప్రారంభం*

ఝార్ఖండ్‌లో తొలి విడతతోపాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ బుధవారం ప్రారంభమైంది.

తొలి విడతలో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది.

683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్‌ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

1.37 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 33 నియోజకవర్గాలకు సిక్కింలోని 2 నియోజకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి..

లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు..!

వికారాబాద్‌; లగచర్ల దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్.. రిమాండ్ రిపోర్ట్‌లో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. లగచర్ల కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్.. ప్రభుత్వ అధికారులపై దాడికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది.. డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ జరుగుతోంది.. అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ సహా ఇతర అధికారులు వచ్చిన సమయంలో కొందరు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. -పోలీసుల రిమాండ్ రిపోర్ట్..

ఫార్మా కారిడార్‌ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ

నిఘా విభాగం ఏం చేస్తోంది..చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి.

ఫార్మా కారిడార్‌ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు..ఫార్మా బాధితుల విషయమై తాను కలెక్టర్‌తో ముందే మాట్లాడానని చెప్పారు. లగచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అలాంటి దాడులను ఎవరైనా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం సొంతం నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డితో కలిసి వికారాబాద్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలు తమకు వద్దని లగచర్ల సహా ఐదు గ్రామాలు ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలోనూ ధర్నాలు చేశారని, ఆయా నిరసనల్లో తాను పాల్గొన్నానన్నారు. లగచర్ల ప్రజలు చేసింది వందశాతం తప్పేనని, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బుధవారం తాను లగచర్లలో పర్యటిస్తానని డీకే అరుణ ప్రకటించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో తప్పు చేసిన వారిని శిక్షించాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. లగచర్ల ఘటనలో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఫార్మా కంపెనీలకు తాము వ్యతిరేకం కాదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాజెక్టులు పెట్టొద్దని ఆయన కోరారు.

రైతులపై అక్రమ కేసులు పెడితే ఊర్కోం : ఈటల

లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోబోమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫార్మా పరిశ్రమకు భూమి అవసరమైతే ఆ కంపెనీ యాజమాన్యమే సేకరిస్తుందని ప్రభుత్వ మధ్వవర్తిత్వం అవసరం లేదన్నారు. రైతుల ఇష్ట ప్రకారమే భూ సేకరణ చేయాలి తప్ప, బలవంతంగా తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని ఈటల స్పష్టం చేశారు. కాగా, లగచర్ల ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. తనపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేసినా గ్రామాల్లో నిర్బంధం విధించి 50 మందిపై అక్రమ కేసులు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఢిల్లీలో ఉన్నప్పుడే సీఎం రేవంత్‌ అక్కడికి వెళ్లడం వెనక మతలబు ఉందని కాసం అన్నారు…

రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదు… సిఎం రేవంత్ రెడ్డి.

రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సృజన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, దీనిపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు..కలెక్టర్‌ దాడిపై సైతం సీఎం రేవంత్‌ స్పందించారు. ‘ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు బిఆర్ఎస్ పార్టీ జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా?, అధికారులపై దాడులను బిఆర్ఎస్ ఎందుకు ఖండించదు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరామర్శలా?,

కేటీఆర్ ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయి. అవినీతి పార్టీ అయిన బిజెపిని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బిజెపి నేతలను కలుస్తున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా? ‘ అని రేవంత్‌ ప్రశ్నించారు..

కొడంగల్ లోని మూడు గ్రామాల జనాలు ఖాళీ..!?

కొడంగల్ లోని మూడు గ్రామాల జనాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరెస్టుల భయంతో పోలీసులు ఎప్పుడొచ్చి ఇళ్ళ మీదపడి లాక్కుని పోతారో అని భయపడిపోయిన గ్రామస్తులు తమ ఊర్లను ఖాళీచేసి వెళ్ళిపోతున్నారు.కొడంగల్(Kodangal Constituency) నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల(Lagacharla), రోటిబండతండా, పులిచెర్లకుంట గ్రామాల్లో చాలా ఇళ్ళకు తాళాలు కనబడుతున్నాయి. మంగళవారం ఉదయం నుండి గ్రామస్తులు ఇళ్ళకు తాళాలు వేసుకుని ఎవరికి వారు ఊర్లను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. దాంతో పోలీసులు కూడా అలర్టయ్యారు.

ఇంతకీ ఏమి జరిగిందంటే సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain), అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి లగచర్ల గ్రామంలో సమావేశానికి వచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా యూనిట్ల(Pharma Units) ఏర్పాటుకు ప్రభుత్వం 3 వేల ఎకరాలను సేకరించబోతోంది. ఈ విషయమై నియోజకవర్గంలోని కొందరు గ్రామస్తులతో రేవంత్ తరపున ఉన్నతాధికారులు ఇప్పటికే మాట్లాడారు. ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు సానుకూలంగా కొందరు రైతులు స్పందిస్తే మరికొందరు రైతులు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న రైతుల గ్రామాలు లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటలోని గ్రామస్తులు, రైతులతో మాట్లాడి కన్వీన్స్ చేసేందుకు కలెక్టర్ తన అధికారులతో గ్రామసభను ఏర్పాటుచేశారు.

ఒకవైపు గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతుండగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. కలెక్టర్ ను మాట్లాడనీయకుండా గ్రామస్తులు పదేపదే అడ్డుపడుతుండటాన్ని అడిషినల్ కలెక్టర్ తప్పుపట్టారు. ముందు కలెక్టర్ ఏమి చెబుతున్నారో విని ఆ తర్వాత గ్రామస్తులు మాట్లాడాలని గట్టిగా చెప్పారు. గ్రామస్తులకు మండిపోయి ఒక్కసారిగా చుట్టుముట్టారు. దాంతో అక్కడ ఏమి జరుగుతోందో అర్ధంకాలేదు. ఈ నేపధ్యంలోనే కలెక్టర్(Attack on Collector) పైన ఎవరో చేయిచేసుకున్నారు. ఇదే అదునుగా గుంపులోని మరికొంతమంది అడిషినల్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ పైన పిడిగుద్దులు కురిపించారు. అంతేకాకుండా వీళ్ళని గ్రామస్తులు తరిమి తరిమి కొట్టారు. కలెక్టర్ తో పాటు అధికారులు కార్లు ఎక్కి వెళ్ళిపోదామని ప్రయత్నించినా విడిచిపెట్టకుండా వెంటపడి కార్లను ధ్వంసంచేశారు. జరిగినదంతా గమనించిన పోలీసులకు ఇదంతా ప్రీప్లాన్డ్ అని అర్ధమైపోయింది.

సీన్ మారిపోయింది

అందుకనే సోమవారం అర్ధరాత్రి వందలసంఖ్యలో పోలీసులు పై మూడు గ్రామాలను చుట్టుముట్టారు. ఉదయం జరిగిన దాడి ఘటనల వీడియోలను విశ్లేషించిన పోలీసులు గ్రామస్తులందరినీ గుర్తించారు. దాడిచేసిన గ్రామస్తులు పైమూడు గ్రామాలవారుగా తెలుసుకున్నారు. అందుకనే రాత్రివరకు వెయిట్ చేసి అర్ధరాత్రి దాడిచేసి చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి తలపుతట్టడంతో బయటకు వచ్చిన ఇళ్ళ యజమనుల్లో వచ్చిన వారిని వచ్చినట్లే పోలీసులు ఎత్తి లోపలేసుకుని వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి కాని తమ ఇంట్లో వాళ్ళని పోలీసులు అరెస్టులు చేసి తీసుకెళ్ళినట్లు ఇంట్లో వాళ్ళకి అర్ధంకాలేదు. దాంతో అప్పటికప్పుడు గ్రామాల్లోని జనాలందరు సమవేశాలు పెట్టుకున్నారు. జరిగిందానిపై చర్చించుకుని ఏమి జరగబోతోందనే విషయాలను కూడా మాట్లాడుకున్నారు. దాంతో ఉదయం అవటం ఆలస్యం పై మూడు గ్రామాల్లోని జనాలు తమ ఇళ్ళకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు.

పై మూడు గ్రామాల్లోని గ్రామస్తులు చాలామంది ఇళ్ళకు తాళాలు వేసుకుని మాయమైపోయారు. తమ ఇళ్ళపైన పడి పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనేభయంతోనే చాలామంది గ్రామస్తులు ఊర్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు సుమారు 60 మందిని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం అంతా వీరిని విచారించి జరిగిన దాడితో ఎలాంటి సంబంధంలేదని నిర్ధారించుకుని 45 మందిని వదిలిపెట్టేశారు. మిగిలిన 15 మందిని మంగళవారం సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టి రిమండుకు తరలించారు. మొత్తానికి రేవంత్ నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా యూనిట్ల ఏర్పాటు విషయం ఏమో కాని నియోజకవర్గంలోని గ్రామాలను గ్రామస్తులు ఖాళీ చేసి వెళ్ళిపోవటం సంచలనంగా మారింది. లగచర్లలోని ఒక రైతు మాట్లాడుతు కలెక్టర్ మీద దాడికి సంబంధించి తమను ఎక్కడ అరెస్టు చేస్తారో అని భయపడి చాలామంది ఇళ్ళని ఖాళీచేసి వెళ్ళిపోయినట్లు చెప్పారు. కలెక్టర్ మీద జరిగిన దాడితో గ్రామస్తుల్లో రైతుల్లో ఎవరికీ సంబంధంలేదన్నాడు.

కలెక్టర్ పై దాడి వెరీ సీరియస్

కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం వెరీ సిరియస్ గా తీసుకుంది. కలెక్టర్ అంటే జిల్లాలో మొదటి పౌరుడే కాకుండా జిల్ల మెజిస్ట్రేట్ కూడా. ప్రధమ పౌరుడు, జిల్ల మెజిస్ట్రేట్ మీద జనాలు దాడిచేస్తే ప్రభుత్వం పోనీలెమ్మని ఊరుకోదు కదా. దాడిచేసిన వారిపై యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వం చేతకానిదిగా ముద్రపడిపోతుంది. రేపు మరో జిల్లా కలెక్టర్ మీద కూడా ఇలాగే దాడి జరుగుతుంది. అందుకనే ఇపుడు జరిగిన దాడి ఇదే మొదటిదిగా ఇదే చివరిదిగా అణిచివేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దానికి తగ్గట్లే జరిగిన దాడిలో మూడు గ్రామాల జనాలను గుర్తించిన పోలీసులు వెంటపడి, వేటాడి మరీ అరెస్టులు చేస్తున్నారు.