లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

అమరావతికి మోదీ భారీ వరం..!!

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం మరో వరం ప్రకటించింది. అమరావతి కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసిన పలు అభ్యర్ధనలను కేంద్రం ఆమోదించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ 15 వేల కోట్ల రుణం పైన ఒప్పందాలు జరిగాయి. జనవరి నుంచి నిర్మాణాల దిశగా ప్రణాళిక లు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దికంగా భారం తగ్గించేలా కేంద్రం నుంచి మరో హామీ దక్కింది. దీంతో, ఏపీ ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కనుంది.

ఏపీ అభ్యర్ధనతో
అమరావతిలో కీలకమైన బైపాస్ ప్రాజెక్టుల భూ సేకరణ ఖర్చు భరించేందుకు కేంద్రం అంగీక రించింది. ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్ధనకు సానుకూలత వ్యక్తం చేసింది. అమరావతిలో ఔటర్, తూర్పు బైపాస్ రోడ్ భూ సేకరణ ఖర్చు భరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 189 కిలో మీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు .. 59 కిలో మీటర్ల తూర్పు బైపాస్ రోడ్ల నిర్మాణం కోసం వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీని కోసం దాదాపుగా రూ 6 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ప్రస్తుతం ఏపీకి ఉన్న ఆర్దిక సమస్యలతో ఈ మొత్తం ఖర్చు చేయటం భారంగా మారుతోంది. దీంతో, ఈ ఖర్చును కేంద్రమే భరించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

అమరావతికి కీలకం
ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత ఏపీ – కేంద్ర అధికారుల మధ్య జరిగిన చర్చల తో బైపాస్ నిర్మాణం కోసం భూ సేకరణ ఖర్చు తామే భరిస్తామని ఎంవోఆర్‌టీహెచ్‌ వెల్లడంచింది. అయితే, ఈ ఒప్పందంలో భాగంగా తమకు స్టేట్‌ జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఇందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్టేట్‌ జీఎస్టీని మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి ఔటర్ బై పాస్ భూ సేకరణ కోసం రూ 4 వేల కోట్లు.. తూర్పు బై పాస్ భూ సేకరణ కోసం రూ 2 వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. ఇప్పుడు కేంద్రం ఈ ఖర్చుకు అంగీకరించటంతో ఏపీ ప్రభుత్వానికి రూ6 వేల కోట్ల మేర రిలీఫ్ దక్కింది.

కేంద్రం అంగీకారంతో.

ఏపీ ప్రభుత్వం గతంలోనే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం భారత్ మాల ఛాలెంజింగ్ ప్రోగ్రాం కింద చేర్చాలని కోరింది. అయితే, అప్పట్లోనే భూ సేకరణ ఖర్చు సగం భరించాలని కేంద్రం షరతు విధించింది. తాజాగా రాజధాని నిర్మాణం కోసం సిద్దం చేసిన అంచనాల్లో అమరావతి ఔటర్ కోసం రూ 26 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఇప్పుడు రహదారి నిర్మాణంతో పాటుగా భూ సేకరణకు కేంద్రం ముందుకు రావటంతో ఇక ఈ నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం స్టేట్ జీఎస్టీ మినహాయింపుతో భూ సేకరణ పైన త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని అధికారులు వెల్లడించారు. రాజధాని నిర్మాణంలో ఇది కీలక ఘట్టంగా మారనుంది..

*ఏపీలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు*

ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. దీనికి సభ
ఆమోదం తెలిపింది. నవంబరు ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు.

విశాఖ … గాజువాక దారుణం..

ప్రేమించలేదని యువతి పై ప్రేమోన్మది దాడి

పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువకుడు దాడి

జమ్మూ కాశ్మిర్ కు చెందిన నీరజ్ శర్మ గత కొంత కాలంగా దొంకాడ మేఘన అనే యువతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు

ఆమె గత కొన్ని మాసాలుగా అతనిని పట్టించుకోకపోవడంతో ఇవాళ ఆ యువతి పై ఇనుప రాడ్డు తో తొలి పై దాడి చేసాడు

మేఘన కేకలు వెయ్యడం తో నిందితుడు పరారి

బాధితురాలిని చికత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలింపు

తలపై బలమైన గాయాలు కావడంతో కుట్లు వేసిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి పై బంధువులు ఆందోళన

అశ్లీల చిత్రాలు యువతికి పంపుతు మార్ఫింగ్ చేసి వేధింపులు..

ఇప్పటికే ఒకసారి పోలీసులకు ఫిర్యాదు..

ఆగ్రహం తో ఇనుప రాడ్డు తో దాడి..

విచారణ జరుపుతున్న న్యూ పోర్ట్ పోలీసులు…

గస్తీ ఒప్పందం వేళ.. భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు

భారత్‌-చైనా (India-China) రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ (Rajnath Singh-Dong Jun) త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది..

సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చేవారం వీరి భేటీ జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నాలుగేళ్లుగా కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందం (Border Truce) కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగుతుందని, ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చని రెండు దేశాలు ఒప్పందంలో పేర్కొన్నాయి. దానిలోభాగంగా కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు తమ మౌలిక సదుపాయాలను, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు ఇటీవల వెల్లడించాయి..

ఇరకాటంలో పట్నం మహేందర్‌రెడ్డి,.అటు సోదరుడు.. ఇటు పార్టీ..

సీఎం సొంత నియోజకవర్గం దుద్యాల్‌ మండలం లగచర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి శాసన మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డిని ఇరకాటంలో పడేసింది…ఘటన జరిగింది మొదలు నోరు మెదపకుండా సైలెంట్‌గా ఉంటూ వస్తున్న ఆయనకు సొంత సోదరుడు నరేందర్‌రెడ్డి అరెస్టు వ్యవహారం మరింత అయోమయంలో పడేసింది. అధికారులపై దాడి ఘటనపై గానీ ఇటు నరేందర్‌రెడ్డి పాత్రపైగానీ మహేందర్‌రెడ్డి నోరు మెదపలేని పరిస్థితి తలెత్తింది. ఇటు సొంత పార్టీ కాంగ్రెస్‌.. అటు సొంత సోదరుడు నరేందర్‌రెడ్డి కావటంతో ఇప్పుడు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. లగచర్లలో కలెక్టర్‌ సహా అధికారులపై దాడి జరిగింది మొదలు అటు ప్రతిపక్ష పార్టీల నేతలు.. ఇటు సొంత పార్టీ నేతలు స్పందిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డి కలెక్టర్‌ను కలిసి పరామర్శించారు. దాడిని ఖండించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సైతం అధికారులకు బాసటగా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఘటనపై స్పందించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కానీ పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

అటు సోదరుడు.. ఇటు పార్టీ

రాజకీయ ఆరంగేట్రం చేసింది మొదలు పట్నం సోదరులు మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఒకే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ముందుగా టీడీపీలో ఆ తరువాత బీఆర్‌ఎస్‌లో అనేక పదవులు చేపట్టినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ రావటంతో ఇలాంటి ఇరకాట పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో మరియు ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు పట్నం సోదరులిద్దరిని విడదీశాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. అనంతరం మహేందర్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ శాసన మండలి చీఫ్‌విప్‌ పదవిని కట్టబెట్టగా ప్రస్తుతం ఆయన ఆ హోదాలో కొనసాగుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ప్రత్యర్థిగా కొడంగల్‌లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మరియు అతని పెద్ద సోదరుడు రాజేందర్‌రెడ్డి కుమారుడు అయిన అవినాశ్‌రెడ్డిలు బీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. దీంతో పట్నం కుటుంబసభ్యులు సగం కాంగ్రెస్‌లో మరో సగం బీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇన్నాళ్లు అంతా సవ్యంగానే నడిచినా లగచర్ల ఘటనతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు పూర్తిగా ఇరకాటంలో పడిపోయారు. అటూ సోదరుడు నరేందర్‌రెడ్డి అరెస్టును ఖండించ లేడు.. ఇటు పార్టీ విధానాల మేరకు అధికారులపై జరిగిన దాడిని కూడా ఖండించలేని పరిస్థితి నెలకొంది. ..

50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల చొప్పున ఇవ్వాలని చూసిన.. సిఎం సిద్దరామయ్య..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య భారతీయ జనతా పార్టీ (BJP)పై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని సిద్దరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అంగీకరించలేదని, అందుకే ఇప్పుడు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెడుతోందని అన్నారు..సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని, వారు (బీజేపీ) 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై , ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర డబ్బులు ముద్రించారా?’ అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు..మైసూరు జిల్లాలోని టి నరసిపుర అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.470 కోట్ల విలువైన ప్రజాపనులను ప్రారంభించిన అనంతరం సిద్ధరామయ్య ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన నేతలంతా రూ. కోట్లు సంపాదించారని, ఆ నగదును ఎమ్మెల్యేలకు ఎరగా వేశారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ఎమ్మెల్యేలు ఎవరూ తలొగ్గకపోవడంతో ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు..

గో బ్యాక్ కలెక్టర్ అంటూ నినాదాలు మాత్రమే చేసాం..ఎవ్వరిపై దాడి చేయలేదు….లగచర్ల గ్రామం బాధితులు..

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దుద్దిల్ల మండలం లగచర్ల గ్రామంలో ఇటీవల కలెక్టర్, అధికారులపై దాడి ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..తాజాగా లగచర్ల గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. మీరు సచ్చినా మీ భూములు మీకు దక్కవని బెదిరించారు. కలెక్టర్ పై దాడి వెనక కుట్ర అనడంలో ఎలాంటి నిజం లేదు. లగచర్లలో మాకు భూములు లేవన్న వాదనలో ఎలాంటి నిజం లేదు. లగచర్ల గ్రామంలో మొత్తం 1200 ఎకరాల భూములు పోతున్నాయి. మా భూమి 15 ఎకరాలు ఉందని తెలిపింది.

మా దగ్గరికి ఎవ్వరికీ వచ్చి మాట్లాడలేదు. డైరెక్ట్ గా ఊరికి వచ్చి మా గిరిజన వాళ్లు ఎవ్వరూ చదువుకోలేదు. వాళ్లకు అసలు కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదు. కలెక్టర్ వచ్చినప్పుడు గో బ్యాక్ కలెక్టర్ అంటూ నినాదాలు చేశారు. అయితే కలెక్టర్ పోలేదు. అసలు కలెక్టర్ పై చేతి కూడా లేపలేదు. ఎవ్వరిపై దాడి చేయలేదని.. దాడి చేయాలని ఎవ్వరూ చేయలేదు..

మమ్మల్ని కొట్టిన, చంపిన కూడా మా భూములు ఇవ్వము..లగచర్ల గ్రామస్తులు.

మమ్మల్ని కొట్టిన, చంపిన కూడా మా భూములు ఇవ్వమని లగచర్ల గ్రామస్తులు (Lagacherla villagers) తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం (Somajiguda Press Club) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో పలువురు లగచర్ల గ్రామస్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు..ఈ సందర్భంగా లగచర్ల గ్రామస్తురాలు మాట్లాడుతూ.. లగచర్లలో తన కుటుంబానికి 15 ఎకరాలు భూమి ఉందని, మాకు భూములు లేవన్న వాదనలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. మాకు కనీసం ఆ రోజు కలెక్టర్ వస్తున్న విషయం కూడా తెలియదు.. మేము ఎవరి మీద దాడి చేయలేదని తెలిపారు.

మా భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయని మమ్మల్ని భయపెడుతున్నారని, మీరు సచ్చినా సరే ఫార్మా కంపెనీ వస్తుందని మమ్మల్ని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను గర్భిణిని.. నాకు ఏమైనా అయితే ప్రభుత్వానిదే బాధ్యత అని లగచర్ల గ్రామస్తురాలు ఫైర్ అయ్యింది. మాకు దాడి చేయాలని ఎవరు చెప్పలేదు, మా భూములు పోతున్నయ్.. అందుకే దాడులు చేస్తున్నామని వెల్లడించింది. భూములు ఇవ్వాలని కూడా మమ్మల్ని అడగలేదు.. మేము ఎందుకు భూములు ఇస్తామని లగచర్ల మహిళా రైతు ప్రభుత్వాన్ని నిలదీశారు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటనతోపాటు హైడ్రా తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఆపాలనిహెచ్చరించారు..అధికార ప్రతినిధి జగన్ పేరుతో రిలీజైన లేఖ సంచలనం రేపుతోంది.

హామీలను తుంగలో తొక్కింది..

రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రేస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తుంది. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తుంది. రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ (గ్లోబల్ హైదరాబాద్) నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ, రివర్ బెడ్ ప్రక్షాళన, హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్ మెంట్సే కార్పోరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డిసిఎల్), కార్యచరణ విభాగం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఇండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రత్యేక విభాగాలను ఏర్పరచి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలస కొనసాగిస్తున్నారు.

అధికార మదంతో దౌర్జన్యం..

మూసీ నదిని పర్యాకటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రిక కట్టడాలను నిర్మించడానికి దేశీ, విదేశీ కార్పోరేట్ల వేల కోట్ల పెట్టుబడులను రేవంత్ ఆహ్వనించాడు. మూసి నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛమైన తాగు నీరు అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడంలేదు. పరిశ్రమల నుండి, నగరం నుండి వెలుపడుతున్న వ్యర్థాలు, అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యం, మురికి నీరు మూసి నదిలో చేరుతున్నాయి. వాటి నివారణ చర్యలు, నీటి శుద్ధి చేయకుండా వీటిన్నింటికి కారణం కేవలం మూసి పరివాహాక ప్రాంత ప్రజలను బాధితులను చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన ఐడా, బడా వ్యక్తుల, సంస్థల పెద్ద, పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం వుంటున్న మద్య తరగతి, పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు. న్యాయ పరమైన అనుమతులు పక్కన పెట్టి, ప్రజలకు ఎలాంటి ముందుస్తు సమాచారం గాని, నోటీస్ లు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యంతో, ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తున్నారు.

రిజర్వు ఫారెస్టు ద్వంసం..

వికరాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండంలో విఎల్ఎఫ్ (వెరీ లో ప్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్(నేవీ రాడార్) స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది. దామగుండంలో నేవి రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ ఫారెస్టు 2900 ఎకరాల భూమిని అప్పగించారు. దీనితో సహజ సిద్ధమైన అనంతగిరికొండలున్న రిజర్వు ఫారెస్టు ద్వంసం అవుతుంది. అడవిపై ఆధారపడి జీవినం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు. కొడంగల్ నియోజవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో పార్మసిటిని నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కొల్పుతున్న రైతులు జీవన, మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు..

విప్లవ కారులపై ఫాసిస్టు దాడులు..

అదిలాబాద్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ప్రజోద్యమాన్ని అణిచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయున్నింగరంగ విధుల నుండి సస్పెండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంలో విప్లవ కారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు. కాంగ్రేస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం దామెరతోగు గ్రామాల వద్ద వందలాది బలగాలను మోహరించి కా.నల్లమారి అశోక్ ను, ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాధపాలెం గ్రామం వద్ద ఆరుగురి విప్లవకారులను పాశవికంగా హత్యలు చేశారు.

కార్పోరేట్ల లాభాల కోసమే..

నేడు రాష్ట్రంలో జరుగుతున్న విద్వంసం, అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనో, బాధ్యత రాహిత్యం వల్లనో జరుగుతున్నది కాదు. ఉద్ద్యేశ పూర్వకంగా కార్పోరేట్ల లాభాల కోసం కొమ్ముకాస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం పదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడులలో వాటా, పెద్ద మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడు. ప్రజలారా! రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ల అనుకూల, ప్రజావ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి. అక్రమ కట్టడాలు, మూసినది ప్రక్షాళన పేర్లతో మద్యతరగతి, పేద ప్రజలపై హైడ్రా కొనసాగిస్తున్న అనాగరిక బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి. పర్యావరణాన్ని విద్వంసం చేస్తున్న నేవి రాడర్ స్టేషన్ ను, పార్మాసిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టాలని పిలపునిచ్చింది…

సిఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఎవరిస్తున్నారో అర్థం కావడం లేదు.. ఈటల రాజేందర్

కంచే చేను మేసిన చందంగా ప్రజల భూములు లాక్కుని మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ప్రశ్నించారు..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే కొడంగల్ లో భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అర్హత లేని సీఎం రేవంత్ రెడ్డి. (CM Revanth Reddy) సోదరుడు లగచర్ల (Lagacharla)కు వెళ్తే అహ్వానం పలికిన పోలీసులు ఎంపీ డీకే అరుణ వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దందాల కోసమే హైడ్రాను సృష్టించారని, ప్రజల భూములు, ఆస్తులు లాక్కునే ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్ద నుంచి బెదిరించి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుంచి భూముల నుంచి వేరు చేయడం అంటే తల్లిని బిడ్డను వేరు చేయడం లాంటిదన్నారు. రైతులు ఒప్పుకోకపోయినా అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పిన తర్వాత కూడా రాత్రికి రాత్రి 1500 పోలీసు బలగాలను మోహరించి గ్రామాల మీదపడి గ్రామాల ప్రజలను అరెస్టులు చేశారని ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగిన పాపానికి కొట్టారని మండిపడ్డారు. ఇంటర్నెట్ ను బంద్ చేసి అరెస్టులు చేశారని ఓట్లేసినందుకు రేవంత్ రెడ్డి చూపిస్తున్న నిజస్వరూపం ఇది అన్నారు. సీఎంకు ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. గతాన్ని అవలోకనం చేసుకోవాలన్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూములు ఉన్నవారు తమ భూమి విలువ రూ.20 కోట్లు రూ.30 కోట్లకు పెరిగిందని సంతోష పడుతుంటే భూములు కోల్పోయిన వారు మాత్రం అదే ఎయిర్ పోర్టులో టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే దుస్థితి ఉందన్నారు. భూములు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊడ్చే ఉద్యోగాలు, తూడ్చే ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో పోలేపల్లె సెజ్ విషయంలో ఇప్పటికే ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అధికారులను కూడా చెబుతున్నాను.. గతంలో వైఎస్సార్, నిన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాలలో ఏం జరిగిందో చూశాం. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా పనిష్మెంట్ తప్పదన్నారు. గత ప్రభుత్వంలో భూసేకరణకు వస్తే తన్నితరమండి అని దుర్మార్గంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ మేము వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు.

మల్టీనేషనల్ కంపెనీలకు విద్యుత్ పై రాయితీ, ట్యాక్సీల రాయితీ, బ్యాంకుల నుంచి అతి తక్కువకే రుణాలు ఇస్తుంటే ఈ పేద రైతుల నుంచి భుములు చౌకకు కొట్టివేసే పనులు ఎందుకు అని ప్రశ్నించారు. మార్కెట్ ధరకు కంపెనీలే భూములు కొనుకుంటాయని ఎందుకు మధ్యలో ప్రభుత్వం బ్రోకర్ పని చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన వాగ్ధానాలు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారన్నారు..

దాడి ఘటనపై కేటీఆర్ కుట్ర దాగి ఉంది..ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..

ట్వీట్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు..
కొండగల్ పరిధిలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనపై కేటీఆర్ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది..నీది రా కుట్ర.. నీ అయ్యది రా కుట్ర, తరతరాలకు సరిపోయే భూమిని ఒక దశాబ్దంలోనే దోచిన.. నీది రా కుట్ర.. నీ కుటుంబానిది రా కుట్ర. ఫాంహౌస్ ల కోసమో.. రిసార్టుల కోసమో కాదు రా.. ఉద్యోగ ఉపాధి అవకాశాల సృష్టికి మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న నీది రా కుట్ర, పదేళ్లలో తెలంగాణను అప్పుల పాలు చేసి.. బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన మీది రా కుట్ర. మల్లన్న సాగర్‌ను కన్నీటి సాగర్‌గా మార్చిన మీదిరా కుట్ర. రంగ నాయక సాగర్‌ను రక్తాలు పారే సాగర్‌గా మార్చిన మీది రా కుట్ర. అరెస్టు.. అరెస్టు.. అరెస్టు అని తెగ కలవరిస్తున్నావు, ఇది కదా నీ అసలు భయం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు..

దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం ఎంతలా ఉందంటే?..

కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఢిల్లీ విలవిలలాడుతోంది. ప్రస్తుతం వాయు నాణ్యత సూచిక (AQI) ప్రమాదకర స్థితిలో 432 వద్ద కొనసాగుతోంది. గాలిలో పొగ పెరగడంతో విజిబిలిటీ భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో AQI ఎలా ఉందో తెలుసుకుందాం. చండీగఢ్‌లో 418, లక్నోలో 234, నోయిడాలో 367, గురుగ్రామ్‌లో 309, చురులో 290, కోల్‌కతాలో 162, హైదరాబాద్‌లో 96, చెన్నైలో 44, బెంగళూరులో 49, ముంబైలో 127గా ఉంది.