లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు..

గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 6 నెలలుగా ఎక్స్-రే యంత్రాలు పని చేయట్లేదు. ఆస్పత్రి మొత్తం 5 యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ ల్లో గాంధీకి వస్తుంటారు…

నయనతారకు స్టార్స్‌..!

ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు..!

నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు

‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్‌ చేశారని నయనతార ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది. సోసల్‌మీడియా వేదికగా ధనుష్‌కు ఫ్యాన్స్‌ నుంచి మద్దతు అందుతోంది. విషయం ఏదైనా అగ్రస్థానంలో ఉన్న నటుడి గురించి ఈవిధంగా బహిరంగంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని వారు అభిప్రాయపడుతున్నారు…

బీభత్సకాండ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు బాధితుల ఫిర్యాదు..!!*

Lagcherla | ‘అయ్యా బాంచెన్‌!.. అర్ధరాత్రి ముందుగనే లైట్లు తీసేసిండ్రు. మందలకొద్ది పోలీసులు, వాళ్ల వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఇండ్లలోకి జొరబడ్డరు.

తలుపులు తియ్యకపోతే గడ్డపారలతో పగులగొట్టి ఇంట్లకొస్తమన్నరు. మాకేం జరుగుతుందో అర్థంకాలె. భయపెట్టిండ్రు. తలుపులు తీసిన ఇండ్లలోకి పొయ్యి.. ఆడోళ్లను ఇక్కడ (ఎదను చూపిస్తూ) తాకుతూ, చిమ్మ చీకట్ల ఇట్ల.. ఇట్ల పిసుకుతూ (ఉబికి వస్తున్న కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ) ఆగమాగం చేసిర్రు. కొందరైతే మా ముందల్నే బిడ్డల చేతులు బట్టుకొని చెరిచేందుకు ప్రయత్నించిండ్రు. ………….. ఇది లగచర్ల బాధిత మహిళల మాట. రైతులు తిరగబడిన నాటి రాత్రి జరిగిన అరాచక కాండను శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వివరిస్తూ వారు కన్నీటి పర్యంతమయ్యారు.

లగచర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాష్టీకాలు ఒక్కొక్కటీ ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి తండాలో కరెంట్‌ తీసేసి, చిమ్మచీకట్లో ఆడబిడ్డల ఛాతీల మీద తడుముతూ, బూటు కాళ్లతో తొక్కుతూ పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన దారుణాలు బయటికొస్తున్నాయి.

చిమ్మ చీకట్లలో చేతులతో స్తనాలను తడిమి.. అడ్డొచ్చినోళ్ల గొంతులు నులిమి.. ఇదేమిటని ప్రశ్నించిన ఆడబిడ్డల తొడలు కమిలేలా.. నుదురు చిట్లేలా.. కొట్టిన అరాచకాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అరెస్టుల పేరుతో ఊరు మీద పడ్డ పోలీసులు, ప్రైవేట్‌ సైన్యం అడ్డగోలుగా దుర్భాషలాడుతూ, డొకల్లో తన్నుతూ, లైంగిక హింసను ప్రేరేపించేలా అర్ధరాత్రి నిర్లజ్జగా, అత్యంత వికృతంగా, అనాగరికంగా ప్రవర్తించిన తీరును కండ్లకు కట్టినట్టు చెప్పేందుకు బాధిత కుటుంబాలు బయటికొచ్చాయి.

11న సోమవారం రోజు అర్ధరాత్రి జరిగిన అరాచకాలపై నోరువిప్పుతూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను, ఆ రోజు పోలీసులు, వారితోపాటు వచ్చిన కొందరు ‘ప్రైవేట్‌ సైన్యం’ వికృతంగా ప్రవర్తించిన తీరును కండ్లకు కట్టినట్టు వివరించారు. పక్కమీద పడుకున్న వారిని అలాగే పెడరెక్కలు విరిచిపట్టి, కొట్టుకుంటూ వ్యాన్లలో పడేసిన దౌర్జన్యకాండను హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కార్యాలయం సాక్షిగా మీడియా ఎదుట బాధితులు కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.

*లాఠీ దెబ్బలకు నా తల్కయ పల్గింది*

‘అర్ధరాత్రి ఒంటిగంటకు వందలమంది పోలీసులొచ్చిండ్రు. లాఠీలతోని తలుపులు పటా పటా కొడుతుండ్రు. మా ముసలోడు ఎవరయ్యా అంటే.. ‘ఏయ్‌ ముసలోడా సప్పుడు చెయ్యకు’ అని లాఠీలతోని బెదిరిస్తే. గమ్మునుండు. తలుపు తీసిన మా కోడలిని చెప్పలేని మాటలతో తిట్టుకుంట పోలీసులే లాఠీలతో కొట్టిర్రు. చిమ్మ చీకట్లలో ఆడబిడ్డల ఎదలమీద చేతులేసి అసభ్యంగా చేసిర్రు (ఏడ్చుకుంటూ).. ఆ దుర్మార్గాన్ని అడ్డుకోబోతే లాఠీలతో నన్నుకొడితే నా తలకు దెబ్బ తల్గి నెత్తురొచ్చింది.

*లక్ష్మీబాయి, పులిచర్లకుంట తండా*

*ఒక్కో ఆడదాని మీదికి 10 మంది పోలీసులు*

అర్ధరాత్రి ఇండ్లలోకి వచ్చి గొడ్లను బాదినట్టు బాదిర్రు. తలుపు తియ్యకపోతే తాళాలు పగలగొట్టిండ్రు. మగోళ్లు లేని ఇండ్లకు జొర్రి.. చెప్పుకోలేని ఇబ్బందులు పెట్టిర్రు. వాళ్లు పగలొచ్చినా ఇంత భయపడే వాళ్లం కాదు. ఒంటిగంటకు ఒక్కో ఆడోళ్ల మీదకు 10 మంది పోలీసులు వచ్చిర్రు. నన్ను కొడితే కాళ్లు, తొడలు కమిలి పోయినయ్‌. ఈ దెబ్బలు బయటికి చూపిస్తే.. నన్నేం జేస్తరోనని ఇన్నిరోజులు చెప్పుకోలే. 4 రోజులైనా కొట్టిన దెబ్బ తగ్గలేదు. నల్లగా కమిలిపోయింది చూడండి (బోరున విలపిస్తూ.. తొడపై కమిలిన లాఠీ దెబ్బలు చూపుతూ).

– *లక్ష్మీబాయి కోడలు*

*ఫార్మా కంపెనీ తెస్తనేందుకు తిరుపతిరెడ్డి ఎవరు?*

ఇంత జరుగుతున్నా రేవంత్‌రెడ్డి మా ఊరు రాలేదు. గొడవలన్నీ అయిపోయినంక మా ఊరికి వస్తడా? ఆయన అన్నని తోలిండు. ఆయనేమన్న ఎమ్మెల్యేనా? ఎలాగైనా ఫార్మా కంపెనీని తీసుకొస్తామని చెప్పేటందుకు ఆయనెవరు? మావోళ్లను జైళ్లేసిండు. ఎందుకు తెస్తడు?

– *గోపీబాయి, లగచర్ల*

*తిరుపతిరెడ్డి ఎవనికి ఎంపీ, ఎమ్మెల్యే?*

అసలు తిరుపతిరెడ్డి మాటిమాటికి ఎందుకొస్తుండు? ఆయన ఎవనికి ఎంపీ, ఎమ్మెల్యే? కూలిపని చేసుకుంటూ బతికే వాళ్లమే సార్‌. రేవంత్‌రెడ్డి సార్‌ మంచి చేస్తడేమోనని ఓట్లేస్తే.. మమ్మల్ని తొక్కి పెడ్తున్నడు. నా బిడ్డకు ఒంట్లో బాగోలేకపోతే హాస్పట్లకు తీస్కపోయి సాయంత్రమొచ్చిన. గొడవ జరిగిందే తెలియదు. లైట్లు బంజేసి, కొట్టుకుంటూ కొడుకును తీస్కపోయిండ్రు. (ఏడ్చుకుంట)

– *మున్నిబాయి, లగచర్ల*

*కలెక్టరేట్‌ ముందు పెట్రోల్‌ పోసుకొని చస్తం*

మా భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు. వికారాబాద్‌ కలెక్టరేట్‌ ఆఫీసు ముందు అందరం పెట్రోల్‌ పోసుకొని చస్తాం. ఇదంతా కలెక్టర్‌ రావట్టే అయింది. ఆయనే చేస్తుండు తాకట్లు.. ఆయన వచ్చినప్పటి నుంచే కదా ఈ లొల్లి. మేము ఏం దోచుకున్నమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు? మమ్మల్నెవరూ ఉసిగొల్పలే.

దేవీబాయి, బాధితురాలు.

*సీఎంకు దమ్ముంటే మా ముందుకు రావాలె*

ఫార్మా సిటీ భూముల కోసం ఎవ్వలెవ్వలోనో ఎందుకు పంపుతున్నవ్‌ సీఎం గారూ? మీకు దమ్ముంటే మీరే రావాలె. నువ్‌ మాకు బాగు చేస్తనంటేనే నీకు ఓట్లేసినం. ఇట్ల ఆగం చేస్తవనుకోలే. మాకు 4 వేల పింఛను రాకపాయె…

*సినీ న‌టి క‌స్తూరిని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజ‌రు ప‌రిచిన పోలీసులు.*

*ఈనెల 29 వ‌ర‌కూ రిమాండ్ విధించిన కోర్టు.*

*చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు..

సిబిఐకి చిక్కిన విశాఖ రైల్వే డిఆర్ఎమ్

25 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ

ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంఛం తీసుకునుకోనెందుకు ముంబై వెళ్లిన సౌరబ్ ప్రసాద్

ముంబైలో సౌరబ్ ప్రసాద్ ను
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సిబిఐ అధికారులు..

విశాఖ డిఆర్ఎం ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తున్న విశాఖ మరియు ఢిల్లీ బృందాలు..

ఈ సోదాల్లో సీబీఐ అధికారులకు కీలక డాక్యుమెంట్స్ లభ్యం..

సౌరబ్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సీబీఐ అధికారులు..

కల్తీలో హైదరాబాద్ నంబర్ 1

ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీలో నెంబర్ 1, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలో జాతీయ స్వచ్ఛ అవార్డులు పొందడంలో నెంబర్ 1

బిర్యానీలకు ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తింపు

కల్తీలతో దెబ్బతింటున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.

19 నగరాల్లో సర్వే చేసి తెలిపిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.

గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు.

సిటీ హోటల్స్‌లో కనీసం నాణ్యత పాటించడం లేదన్న క్రైమ్ రికార్డ్స్ బ్యూరో.

62 శాతం హోటల్స్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు.

సెంట్రల్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్….

బోయిన్‌పల్లిలో భారీగా నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్ పట్టివేత.. 15 టన్నుల అల్లంవెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు.. ప్రమాదకర రసాయనాలు కలిపి అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్న ముఠా.. సోనీ గార్లిక్ పేరుతో హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్న ఆసిమ్

నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీల ప్రజా పాలన విజయోత్సవ స‌భ‌.

మ‌హిళా సాధికారత‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా హన్మకొండ స‌భ‌.

మ‌హిళా సాధికారత థీమ్ తో విజ‌యోత్స‌వ స‌భ‌

విజ‌యోత్స‌వ స‌భ వేదికగా మ‌హిళా సాధికార‌త‌కు వినూత్న ప‌థ‌కాలు.

నూత‌న ప‌థ‌కాల‌పై పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క స‌మీక్షా స‌మావేశం.

నూత‌న ప‌థ‌కాల విధి విధానాలు, స‌భ ప్రాంగ‌ణంలో సెర్ప్ ఆద్వ‌ర్యంలో స్టాల్ల ఏర్పాటు, స‌భ ఏర్పాట్ల‌ను స‌మీక్షించిన మంత్రి సీత‌క్క‌

హ‌జ‌రైన పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి డీ ఎస్ లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ‌రాజ‌న్, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ

*మంత్రి సీత‌క్క‌*

కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యం

గ్రామీణ మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వెత్త‌లుగా తీర్చిదిద్దేలా కార్యాచ‌ర‌ణ‌..

విజయోత్సవ స‌భ వేదిక‌గా మ‌హిళల‌ ఆర్దిక బ‌లోపేతం కోసం స‌రికొత్త‌ ప‌థ‌కాలు.

22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న‌.

మ‌హిళా సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించ‌నున్న ప్ర‌భుత్వం..

దేశ చరిత్ర‌లో మ‌హిళా సంఘాల‌కు తొలిసారిగా విద్యుత్ ప్లాంట్లు.

మ‌హిళా సంఘాల సభ్యుల‌కు భీమా సౌక‌ర్యం..

ట్రాన్స్ జెండ‌ర్ల‌ కోసం జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక‌ క్లినిక్ ల ఏర్పాటు.

పుట్ట మధుకర్‌ను హత్య చేయాలని మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీను బాబు కుట్ర...

పుట్ట మధుకర్‌ను హత్య చేయాలని మంత్రి శ్రీధర్ బాబు, ఆయన తమ్ముడు శ్రీను బాబు కుట్ర పన్నారు

పుట్ట మధుకర్ కర్నూల్‌కు వెళ్తుంటే హత్య చేయమని నాకు చెప్పారు. నేను 40 మందితో వెళ్తే బండి టైర్ పంక్చర్ అయి ప్లాన్ ఫెయిల్ అయింది.

శ్రీధర్ బాబును ఎవరు ప్రశ్నిస్తే వారిని అంతం చేయాలని చూస్తున్నాడు – మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడు నారన్ రెడ్డి…

కాళ్ల నొప్పులతో రెండు రోజులు కనబడకుంటే ఇంత రాద్ధాంతం చేయాలా?..బండి సంజయ్...

బీజేపీ ఎంపీ బండి సంజయ్…మాట్లడుతూ..లేచినా, పడుకున్నా బీఆర్ఎస్ నేతలకు నేనే గుర్తుకు వస్తున్నా. అందుకే బీఆర్ఎస్ సంగతి చెబుదామని ఈ రోజు బయటకి వచ్చా – ..తెలంగాణలో బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని తొక్కేస్తున్నారు.

ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.

హైదరాబాద్: ముగిసిన బీజేపీ నేతల మూసీ నిద్ర.. రాత్రి మూసీ పరివాహక బస్తీల్లో పర్యటించిన బీజేపీ నేతలు.. బస్తీ వాసుల ఇళ్లలో భోజనం చేసి అక్కడే నిద్రించిన బీజేపీ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు స్పందనగా మూసీ నిద్ర చేపట్టిన బీజేపీ నేతలు.. మూసీ ప్రక్షాళన చేయండి, పేదల ఇళ్లు కూల్చకండి అని బీజేపీ డిమాండ్.. వివిధ బస్తీల్లో నిద్ర చేసిన కిషన్ రెడ్డి, ఈటెల, లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రామ చందర్ రావు తదితర నేతలు పాల్గొన్నరు..

*రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తి*

*కడ చూపు చూసేందుకు తరలివచ్చిన బంధువులు, ఆప్తులు, ప్రముఖులు, నేతలు*

*తల్లిదండ్రుల సమాధుల వద్దే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి అంతిమ సంస్కారాలు*

*చంద్రగిరి.. సీఎం చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామమైన నారావారిపల్లెలో ఆదివారం ప్రభుత్వ లాంఛనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తినాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్ర పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంటకు తీసుకొచ్చి, అక్కడి నుండి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు తరలించారు. అభిమానులు, ఆప్తులు, బంధుమిత్రులు, నేతలు, ప్రజల సందర్శనార్ధం నారావారిపల్లెలోని సీఎం చంద్రబాబు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. సోదరుడి కడ చూపుతో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు రామ్మూర్తి నాయుడుకి నివాళులర్పించారు. చంద్రబాబు, లోకేష్, రామ్మూర్తి కుటుంబ సభ్యులు ఇందిర, రోహిత్, గిరీష్ లను పరామర్శించారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ జనసందోహం మధ్య రామ్మూర్తి నాయుడి అంతిమయాత్ర కొనసాగింది. రామ్మూర్తి నాయుడుని చివరి చూపు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ్ముడి పాడెను చంద్రబాబు, లోకేష్ మోశారు. తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి దహన సంస్కారాలు చేపట్టారు..

*మిస్ యూనివర్స్ డెన్మార్క్ బ్యూటీ*

డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్నారు.21 ఏళ్ల ఆమె 125 కంటెస్టెంట్లతో పోటీపడి విజేతగా నిలిచారు.

మిస్ యూనివర్స్ పోటీలు మెక్సికోలో ఈ పోటీలు జరిగాయి. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్టినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్టాన్ మొదటి, రెండో రన్నరప్ గా నిలిచారు..

*హైపర్సోనిక్ మిస్సెల్ ప్రయోగం సక్సెస్*

భారత ఆర్మీ కోసం కొత్తగా రూపొందించిన లాంగ్ రేంజ్
హైపర్సోనిక్ మిస్సైల్ను DRDO విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నిన్న దీన్ని ప్రయోగించారు. ఈ హైపర్ సోనిక్ మిస్సైల్ 1500 KMకు పైగా దూరానికి పేలోడ్లను మోసుకెళ్ల గలదు. HYDలోని అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్సులో దీన్ని రూపొందించారు. ఇది హిస్టారికల్ మూమెంట్ అని, సైంటిస్టులను అందరినీ అభినందిస్తున్నానని..రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు..

పాడె మోసిన చంద్రబాబు.. డప్పు కొట్టిన మందకృష్ణ మాదిగ

AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు ముగిశాయి.

నారావారిపల్లెలో అధికార లాంఛనాలతో ఆయన
అంత్యక్రియలు జరిపారు. పెద్ద కొడుకు నారా రోహిత్
దహన సంస్కారాలు నిర్వహించారు. తమ్ముడి పాడెను చంద్రబాబు మోశారు. అలాగే ఎమ్మార్పీస్ అధ్యక్షుడు
మంద కృష్ణ మాదిగ డప్పు కొట్టారు. అంత్యక్రియల్లో
పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు..

పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పులు విసిరిన ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్

పాట్నా – గాంధీ స్టేడియంలో జరుగుతోన్న ‘పుష్ప -2’ ట్రైలర్ ఈవెంట్లో ట్రైలర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు….