Letest news… లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్…

జానీ మాస్టర్‌కు షాక్ ఇచ్చిన పోలీసులు..

జానీ మాస్టర్‌ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు…జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు..జానీ మాస్టర్‌ కేసులో మళ్లీ కదలిక…..లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు..లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ..ఈవెంట్స్‌ పేరుతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లారని చెబుతున్న పోలీసులు….అక్కడే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తేల్చిన పోలీసులు………..

ఆ కాల్స్ వస్తే స్పందించొద్దు.. ప్రజలకు సజ్జనార్ కీలక సూచన.

దేశంలో గత కొంత కాలంగా సైబర్ మోసాలు(Cyber Frauds) పెరిగిపోతున్న విషయం తెలిసిసిందే. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకొని ప్రజల నుంచి అందినకాడికి డబ్బును దోచేస్తున్నారు..కాల్స్(calls), మెస్సేజెస్(Messages), లింక్స్(Links) ఇలా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకొని కేటుగాళ్లు అమాయక ప్రజలకు వల వేస్తున్నారు. సైబర్ మోసాలు రోజురోజుకి ఎక్కువైతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(VC Sajjanar) తాజాగా కీలక సూచనలు చేశారు. కొత్త తరహా సైబర్ మోసల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్(X)’ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ల నుంచి తల్లిదండ్రులకు(Parents) ఫోన్ కాల్స్ చేసి మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్(Accident)కు గురయ్యారని, హాస్పిటల్(Hospital)లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, సర్జరీ(Surgery) కోసం వెంటనే డబ్బులు పంపాలనే మాయగాళ్ల బారిన పడవద్దని, డబ్బులు పంపాలంటూ లింకులను షేర్ చేస్తున్న కేటుగాళ్ల కాల్స్/ మెసేజులుకు స్పందించవద్దన్నారు. ఆ లింకులను క్లిక్ చేయగానే బ్యాంక్ ఖాతాల(Bank Accounts) నుంచి నేరగాళ్లు నగదును గుల్ల చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తే కేంద్ర హోంశాఖ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోస్టులో పేర్కొన్నారు..

త్వరలోనే ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్…

సీబీఐ, ఈడీకి బీజేపీ ఆదేశాలిచ్చిందన్న ..మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్……….

దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంటుంది. ఇక అధికారంలో ఉన్న ఆప్.. ఇప్పటికే 70 మంది అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసి.. మేనిఫేస్టో, ఎన్నికల హామీలు, ప్రచారంతో ఎన్నికల హడావుడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని.. ఓ ఫేక్ కేసులో అరెస్ట్ చేస్తారని జోస్యం చెప్పారు…………..

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఓ తప్పుడు కేసును బనాయించి.. సీఎం అతిశీని ఆరెస్ట్ చేస్తారని.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అంతకంటే ముందు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారని రాసుకొచ్చారు. ఆ ట్వీట్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేపట్టిన అధికార ఆప్.. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించేందుకు మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలను ప్రకటించింది. వీటికి సంబంధించి ఇప్పటికే అప్లికేషన్లు కూడా స్వీకరిస్తోంది…………..

ఢిల్లీలో ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్‌ యోజన కింద రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2100 ఆర్థిక సాయం చేస్తామని ఇటీవలె ఆ పార్టీ ప్రకటించింది. దీంతో పాటు సంజీవని యోజన కింద ఢిల్లీలోని సీనియర్‌ సిటిజన్లు అందరికీ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ రెండు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఇప్పటికే స్వీకరించడం మొదలుపెట్టింది…………….

ఈ క్రమంలోనే తాజాగా “పాత్రికేయు”ల సమావేశం ఏర్పాటు చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఇటీవల సీబీఐ, ఈడీ అధికారుల సమావేశం జరిగిందని.. ఆ సందర్భంగా ఢిల్లీ సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని మాట్లాడుకున్నారని.. అయితే ఆ సమాచారం తమ వద్దకు చేరిందని వెల్లడించారు. మరోవైపు.. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాలకు సంబంధించి ఢిల్లీ ప్రజలను హెచ్చరిస్తూ తాజాగా న్యూస్ పేపర్‌లో ఒక ప్రకటన వెలువడటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకాల కింద మహిళలకు నెలకు రూ.2100, సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం కల్పిస్తామని మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్న మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు.. ఈ పథకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాయి. అంతేకాకుండా ఢిల్లీ ప్రభుత్వం కూడా అలాంటి పథకాలను నోటిఫై చేయలేదని తేల్చి చెప్పాయి..

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన ఢిల్లీ సీఎం అతిశీ న్యూస్ పేపర్‌లో వచ్చిన ప్రకటనను తప్పుబట్టారు. కొంతమంది అధికారులపై బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చి.. అవి ప్రచురించిందని.. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు సేవలను నిలిపివేసేందుకు.. తనపై తప్పుడు కేసు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తమ వద్ద సమాచారం ఉందని అతిశీ పేర్కొన్నారు. వారు తనను అరెస్ట్ చేసినా..
న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై నమ్మకం ఉందని….తనకు బెయిల్ వస్తుందని తేల్చి చెప్పారు…………..

మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన

ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగింది.

సున్నితమైన సమస్యలపై మా సభ్యులు స్పందించొద్దు.

సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిది.

ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుంది…

ఆప్‌తో కూటమి పొరపాటు చేశాం – .

కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసి తప్పు చేశామని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అరవింద్ కేజ్రీవాల్ పేరును ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన్ను ఫర్జివాల్ అని పిలవొచ్చు అని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల తమ వైఖరిని స్పష్టంచేస్తూ కాంగ్రెస్ పార్టీ 12 పేజీలతో వైట్ పేపర్ రిలీజ్ చేసింది. మౌకా మౌకా హర్ బార్ ధోకా అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ శ్వేతపత్రంలో కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం

Plane Crash: కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం కజకిస్తాన్‌లో బుధవారం విమానం కుప్పకూలింది. కూలిన విమానం అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంగా గుర్తించారు ( Azerbaijan Airlines Flight Crashed in Kazakstan). ప్రమాదం జరిగిన సమయంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో 32 మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మరో 30 మంది గాయాలతో బయటపడినట్లు సమాచారం అందుతోంది…

బలహీనపడనున్న అల్పపీడనం..ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..

నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి అల్పపీడనాన్ని , తనవైపు లాగేందుకు ప్రయత్నిస్తోందని వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దానికి అనుబంధంగా 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది….

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్‌ గాంధీ అభినందనలు..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అన్ని గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అభినందనలు తెలిపారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు. అలాగే రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పార్టీ ఆకాంక్షలను సాకారం చేసే దిశగా ప్రజాప్రతినిధులందరూ నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాహుల్‌ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో, రాహుల్‌ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళతామంటూ ఇటీవల రాహుల్‌కుపొన్నం లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా రాహుల్‌ మంత్రికి లేఖ రాసి, అభినందనలు తెలిపారు…

మహిళా కానిస్టేబుల్‌తో సహా కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య!..ఎస్సై అదృశ్యం...

కామారెడ్డి జిల్లా (Kama Reddy District)లో మహిళా కానిస్టేబుల్ శృతి (Shruthi) చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది…అయితే, ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా అడ్లూర్‌ (Adlur)లోని ఎల్లారెడ్డి చెరువు (Yellareddy Lake)లోకి దూకినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ముగ్గురి కోసం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సింధు శర్మ (SP Sindhu Sharma) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా కానిస్టేబుల్ శృతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వారిలో బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి….

Si మొబైల్ స్విచ్ అఫ్…!
భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ సెల్‌ఫోన్‌ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్విచ్‌ఆఫ్‌ రావడంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ఆరంభించారు. బీబీపేట ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు స్టేషన్లో చెప్పి బయటికి వెళ్ళడం . మధ్యాహ్నమైనా కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్‌లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు బీబీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్‌ నుంచి ఎప్పుడో వెళ్లిపోయినట్లు వారు తెలపడంతో ఆందోళన చెందిన శ్రుతి తల్లిదండ్రులు వెంటనే అధికారులను సంప్రదించారు. ఆమె ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్‌ శ్రుతి సెల్‌తోపాటు బీబీపేటకు చెందిన నిఖిల్‌ సెల్‌ కూడా దొరికింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌కు చెందిన కారు, పాదరక్షలు, నిఖిల్‌ పాదరక్షలూ కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. ఎస్సై ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అని వస్తుండడంతో ఏం జరిగి ఉంటుందన్నది అంతుచిక్కడం లేదు..

టిడిపిలో చేరిన బైరెడ్డి దంపతులు..!

వైసిపికి చెందిన బైరెడ్డి నాగేశ్వరరావు, లీలావతి దంపతులు, మహంతి రాంబాబు, కొక్కిరి మల్లేష్‌ పాటు సుమారు 50 కుటుంబాల వారు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు సమక్షంలో బుధవారం టిడిపిలో చేరారు..అనంతరం మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్‌ బైరెడ్డి సూర్యనారాయణ వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి పతివాడ తమ్మినాయుడు, నియోజకవర్గ నాయకులు కంది చంద్రశేఖర్‌, మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గేదల రాజారావు, పార్లమెంట్‌ కార్యదర్శి లెంక అప్పలనాయుడు, రాష్ట్ర నాగవంశం కన్వీనర్‌ అవనాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..

ఇండియన్ సినిమా నుంచి ప్రోత్సాహం ఉండాలి.. టాలీవుడ్ లో అద్భుత సినిమాలు..సీఎం అబ్దుల్లా ప్రశంసలు..

బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ సినిమా నుంచి ప్రోత్సాహం ఉండాలని కోరారు. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అబ్దుల్లా మాట్లాడుతూ.. దక్షిణ భారత పరిశ్రమకు చెందిన చిత్రనిర్మాతలతో మరింత కనెక్ట్ అవ్వాలనే కోరికను కూడా ఆయన వ్యక్తపరిచారు.

డబ్బు ఎక్కడ, బడ్జెట్‌లు ఎక్కువగా ఉంటాయి అనేది దానిపై మనం ఫోకస్ చేయాల్సిన ప్రదేశాలుగా పేర్కొన్నారు. వాస్తవానికి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా జమ్మూకశ్మీర్ పర్యాటకంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 300-400 కోట్ల సినిమా బడ్జెట్ ఉన్నవాటిని అహం లేదా అజ్ఞానం కారణంగా మనం ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగా విస్మరించామని అబ్దుల్లా ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆకర్షణీయమైన ప్రయాణ గమ్యస్థానంగా ..

బాలీవుడ్‌తో చారిత్రక సంబంధాన్ని సీఎం అబ్దుల్లా ఎత్తిచూపారు. తరతరాలకు ఇష్టమైన హనీమూన్ డెస్టినేషన్‌గా లోయను నెలకొల్పడానికి ఈ సినిమా దోహదపడిందని ఆయన అన్నారు. సౌత్ ఇండియన్ సినిమాతో అనుబంధం అనే వ్యూహం ద్వంద్వ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది.

దక్షిణ భారత చలనచిత్రాలలో ఈ ప్రాంతం సహజ సౌందర్యాన్ని ప్రదర్శించడమే కాకుండా సాంప్రదాయకంగా లోయను సందర్శించని దక్షిణ భారత పర్యాటకులలో కాశ్మీర్‌ను ఆకర్షణీయమైన ప్రయాణ గమ్యస్థానంగా మారుతుంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ పరిమాణం గురించి కచ్చితమైన అంచనా లేదన్నారు.

టాలీవుడ్ బంపర్ వసూళ్లు ..

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2022 నివేదికలో.. టాలీవుడ్ విలువ సుమారు రూ. 74900 కోట్లుగా అంచనా. రీజనల్ ఈజ్ ది న్యూ నేషనల్, వే ఫార్వర్డ్ ఫర్ ద సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ అనే రిపోర్టులో మొత్తం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లో 35 శాతం వాటాను కలిగిన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ సాంకేతికంగా పెరుగుతున్నప్పటికీ దాని ఔచిత్యాన్ని కొనసాగిస్తోందని వెల్లడించింది. మీడియా కన్సల్టెన్సీ సంస్థ (Rmax) మీడియా ప్రకారం.. టాలీవుడ్, తెలుగు భాషా చిత్ర పరిశ్రమ, గత ఏడాదిలో 212 మిలియన్ డాలర్లు సంపాదించి, బాలీవుడ్ 197 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించింది.

సినిమాలు, వీడియో ఆల్బమ్‌ల కోసం జమ్మూకాశ్మీర్‌ను ప్రధాన చిత్రీకరణ ప్రదేశంగా మార్కెటింగ్ చేసే అవకాశాలను అబ్దుల్లా ప్రస్తావించారు. వీటికి షూటింగ్‌కు సిద్ధం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. ఇప్పుడు ప్రధాన వాణిజ్య వ్యాపార అవకాశంగా ఉన్న డెస్టినేషన్ వెడ్డింగ్ మార్కెట్‌ను కూడా ఆయన హైలైట్ చేశారు. బదుల్లా పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు జమ్మూకాశ్మీర్ ప్రత్యేక అందాలను విస్తృత ప్రేక్షకులకు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాశ్మీర్‌లో కొన్ని కొత్త గమ్యస్థానాలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదన కూడా చేసినట్టు సీఎం అబ్దుల్లా చెప్పారు..

బీజేపీ నేత సువేందు అధికారిపై దాడికి బంగ్లాదేశ్ టెర్రరిస్టు గ్రూపుల కుట్ర…

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది…బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

దుండగులు గత వారం ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు, పరిసరాల గురించి సర్వే చేసినట్లు, సువేందు అధికారి నివాసాన్ని ఫోటోలు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం..తక్షణ చర్యలు తీసుకోవాలని ఐబీ అధికారులు కోల్‌కతా పోలీసులను, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు అందాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నుండి Z+ సెక్యూరిటీ ఉన్న ఆయనకు మరింత సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు వచ్చాయి. పండుగ సీజన్‌లో ప్రమాదం ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర మరియు స్థానిక పోలీసు బలగాలతో పాటు CISF కూడా తమ నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఐబీ సూచించింది…